Short News

చిన్నప్పటి ఫొటోలో ఎన్టీఆర్ ను చూశారా.?

చిన్నప్పటి ఫొటోలో ఎన్టీఆర్ ను చూశారా.?

నందమూరి కథానాయకుడు ఎన్టీఆర్‌ చిన్నతనంలో దిగిన ఈ ఫొటోను చూశారా.? తారక్‌ తన తల్లి శాలిని పక్కన నిలబడిన దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఎన్టీఆర్‌ ఇటీవల ‘జై లవకుశ'తో మంచి హిట్‌ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ సినిమాను నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. దీని తర్వాత ఎన్టీఆర్‌ ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించనున్న మల్టీస్టారర్‌లో నటించనున్నారు.
అబూ సలెం పెరోల్ దరఖాస్తు తిరస్కరణ

అబూ సలెం పెరోల్ దరఖాస్తు తిరస్కరణ

బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన గ్యాంగ్ స్టర్ అబూసలేం రెండో పెళ్లి కోసం పెట్టుకున్న పెరోల్ దరఖాస్తును నవీ ముంబై పోలీసు కమిషనర్ తిరస్కరించారు. 1993లో ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో 257 మంది మరణించగా, 713 మంది గాయపడ్డారు. ఈ కేసులో కీలక దోషి అయిన అతనికి కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ నేపథ్యంలో జైలులో ఉన్న అబూ సలేం తాజాగా తాను రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, తనకు 45రోజుల పాటు పెరోల్ ఇవ్వాలని అభ్యర్థించాడు. అయితే పెరోల్ దరఖాస్తును పోలీసులు తిరస్కరించారు.
మరోసారి తండ్రి కాబోతున్న షాహిద్‌ కపూర్‌

మరోసారి తండ్రి కాబోతున్న షాహిద్‌ కపూర్‌

బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ మరోసారి తండ్రి కాబోతున్నాడనే వార్త సందడి చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షాహిద్‌ షేర్ చేసిన మిషా ఫొటోలో బిగ్‌ సిస్టర్‌ అనే అక్షరాలు ఉండటం దీనికి మరింత బలం చేకూర్చుతోంది. షాహిద్‌- మీరా దంపతులు మరో బేబీని తమ జీవితాల్లోకి ఆహ్వానిస్తున్నారంటూ కామెంట్‌ చేస్తున్నారు. మీరా రాజ్‌పుత్‌ ప్రెగ్నెంట్‌ అంటూ బీ టౌన్‌లో ఇప్పటికే వదంతులు ప్రచారం అవుతున్నాయి. షాహిద్‌ కపూర్‌ 2015లో మీరా రాజ్‌పుత్‌ను పెళ్ళాడాడు. షాహిద్‌ ప్రస్తుతం శ్రీ నారాయణ్‌ సింగ్‌ దర్శకత్వంలో సభట్టీ గుల్‌ మీటర్‌ చాలూ' సినిమాలో నటిస్తున్నాడు. 
వొడాపోన్ రోజుకి 2జిబి డేటా ప్లాన్, టార్గెట్ ఆ రెండే !

వొడాపోన్ రోజుకి 2జిబి డేటా ప్లాన్, టార్గెట్ ఆ రెండే !

దేశీయ టెలికాం రంగం రోజురోజుకు పెను విప్లవాల వైపుగా దూసుకుపోతోంది. జియో రాకతో పోటీవాతావరణం వేడెక్కిన విషయం అందరికీ తెలిసిందే. ఉచిత ఆఫర్లతో దిగ్గజాలకు ముచ్చెమటలు పట్టించిన జియోని ఢీకొట్టడమే లక్ష్యంగా మిగతా టెల్కోలు ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులు తమ నుంచి చేజారిపోకుండా కాపాడుకుంటున్నాయి.ఈ నేపథ్యంలోనే ప్రధాన పోటీదారులైన జియో, ఎయిర్‌టెల్‌తో సమానంగా వొడాఫోన్‌ సరికొత్త ప్లాన్‌తో ప్రజల ముందుకు వచ్చింది. 28 రోజుల పాటు రోజుకు 2జిబి డేటాను అందించే ప్లానుతో యూజర్లను ఆకట్టుకునేందుకు రెడీ అయింది.