Short News

ఉత్కంఠగా 'జురాసిక్‌ వరల్డ్‌: ఫాలెన్‌ కింగ్‌డమ్‌'
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/OogedrOiq8I" frameborder="0" allow="autoplay; encrypted-media" allowfullscreen></iframe>

ఉత్కంఠగా 'జురాసిక్‌ వరల్డ్‌: ఫాలెన్‌ కింగ్‌డమ్‌'

'జురాసిక్‌ పార్క్' సిరీస్‌లో వస్తున్న తాజా చిత్రం 'జురాసిక్‌ వరల్డ్‌: ఫాలెన్‌ కింగ్‌డమ్‌'. 2015లో వచ్చిన 'జురాసిక్‌ వరల్డ్‌'కు  సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి జె.ఏ.బెయోనా దర్శకుడు. క్రిస్‌ ప్రాట్‌, బ్రెసీ డల్లాస్‌ హోవర్డ్‌, బి.డి.వాంగ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా సరికొత్త ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసారు. స్పీల్‌ బర్గ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం జూన్‌ 22, 2018న విడుదల కానుంది.  
స్నేహితులుగా ర్యాంప్ వాక్ చేసిన మాజీ ప్రేమికులు

స్నేహితులుగా ర్యాంప్ వాక్ చేసిన మాజీ ప్రేమికులు

బాలీవుడ్ మాజీ ప్రేమికులు రణ్‌బీర్‌ కపూర్‌, దీపిక పదుకోన్ మనస్పర్ధలు ఏర్పడి విడిపోయినా స్నేహితులుగా ఉన్నారు. గురువారం ముంబయిలో జరిగిన 2018 మిజ్వాన్‌ ఫ్యాషన్ షోలో ఇద్దరూ చేతిలో చేయి వేసుకుని కలిసి ర్యాంప్ వాక్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్రా డిజైన్‌ చేసిన దుస్తులనే వేసుకున్నారు. 'రణ్‌బీర్‌, దీపిక కలిసి ర్యాంప్‌ వాక్‌ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా కోసం ర్యాంప్‌ వాక్ చేయడానికి ఒప్పుకున్నందుకు ఆనందంగా ఉంది' అని మనీశ్‌ మల్హోత్రా వెల్లడించారు.
పవన్‌ వ్యాఖ్యలు చాలా బాధించాయి

పవన్‌ వ్యాఖ్యలు చాలా బాధించాయి

జనసేన అధినేత, సినీనటుడు పవన్‌ కళ్యాణ్ ట్విట్టర్‌ కామెంట్స్‌పై ఏపీ మంత్రి నారా లోకేశ్‌ స్పందించారు. 'పవన్‌ వ్యాఖ్యలు చాలా బాధించాయి. ఇంతకు ముందు కూడా నాపై వ్యక్తిగతంగా ఎన్నో ఆరోపణలు చేసి ఎవరో చెబితే అన్నానన్నారు. ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎన్నో ఏళ్ళ శ్రమ ఫలితం. ఎవరో అన్న.. విన్న మాటల ఆధారంగా ఆరోపణలు చేసే కుసంస్కారిని కాదు. వాస్తవాలన్నింటినీ కాలమే ప్రజల ముందు ఉంచుతుంది. పవన్‌ పట్ల నా హృదయంలో గౌరవ స్థానమే ఉంది' అని పేర్కొన్నారు.
కళ్యాణి లీక్స్ ..ఇవి శ్రీరెడ్డి ఫోటోలేనా.!

కళ్యాణి లీక్స్ ..ఇవి శ్రీరెడ్డి ఫోటోలేనా.!

శ్రీరెడ్డి వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. నటి కరాటే కళ్యాణి ఫేస్ బుక్ వేదికగా శ్రీరెడ్డికి సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ చేసింది. 'పెళ్ళి కాని విమల(శ్రీరెడ్డి)కు ఇంత పెద్ద కూతురు ఎక్కడినుండి వచ్చింది. విజయవాడ శ్రీ చైతన్యలో ఇంటర్ పూర్తి చేసింది. అమ్మతో 10 సంవత్సరాలు నుండి సంబంధం లేకపోతే కొంత కాలం క్రిందట కూకట్‌పల్లి లోథా మెరిడియన్‌లో కోటిన్నర విలువ గల ప్లాట్‌లో ఇద్దరు ఎలా గృహప్రవేశం చేసారు.? ఏంటో, విమల నీకే తెలియాలి మరి కొన్ని నాకు నచ్చినప్పుడు లీక్ చేస్తా' అని పేర్కొంది.