Short News

'కాలా'కు షాకిచ్చిన లీకేజీ

'కాలా'కు షాకిచ్చిన లీకేజీ

రజనీకాంత్‌ నటిస్తున్న చిత్రం 'కాలా'. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 27న విడుదలవుతోంది. ధనుష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పైరసీ బెడద మొదలైంది. సంగీతం, ఎడిటింగ్‌ పనులు వేగంగా జరుగుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోరాట సన్నివేశం ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. దీన్ని చూసి చిత్రబృందం ఆశ్చర్యానికి గురైంది. ఎడిటింగ్‌ స్టూడియో నుండే బయటకు పొక్కిందని భావిస్తున్నారు.
వచ్చే నెల 14న పవన్ భారీ సభ?: మోడీపై అవిశ్వాసం.. టీడీపీ-వైసీపీలకు గట్టి షాక్!

వచ్చే నెల 14న పవన్ భారీ సభ?: మోడీపై అవిశ్వాసం.. టీడీపీ-వైసీపీలకు గట్టి షాక్!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనంలోకి వెళ్లాలని యోచిస్తున్నారు. ఈ మేరకు మార్చి 14వ తేదీన పార్టీ స్థాపించి నాలుగేళ్లు అవుతుంది. రాష్ట్ర ప్రజల సమస్యలపై స్పష్టమైన విధివిధానాలతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో నిర్వహించాలని భావిస్తున్నారని అంటున్నారు. ప్లీనరీ రూపంలో లేదా భారీ బహిరంగ సభగా నిర్వహించనున్నారని తెలుస్తోంది.

పీఎన్బీ స్కాంపై నోరు మెదపరేం: మోడీపై రాహుల్ ఫైర్

పీఎన్బీ స్కాంపై నోరు మెదపరేం: మోడీపై రాహుల్ ఫైర్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడ్డారు. పరీక్షలకు ఎలా హాజరవ్వాలో గంటలపాటు నరేంద్ర మోడీ విద్యార్థులకు బోధిస్తున్నారని.. అయితే నీరవ్ మోడీ చేసిన మోసాలకు బాధ్యత ఎవరిదో చెప్పడం లేదని ఆరోపించారు. దేశం నుంచి డబ్బును నీరవ్ మోడీ తీసుకెళ్ళిపోయారన్నారు. నరేంద్ర మోడీ రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసి.. ప్రజల సొమ్మును బ్యాంకుల్లో వేయించారన్నారు.

అగ్రిగోల్డ్ తరహా మోసం: ‘బొమ్మరిల్లు’ రాయల రాజా అరెస్ట్

అగ్రిగోల్డ్ తరహా మోసం: ‘బొమ్మరిల్లు’ రాయల రాజా అరెస్ట్

అగ్రిగోల్డ్ తరహాలో ఏపీలో మరో మోసం వెలుగుచూసింది. బొమ్మరిల్లు ఫామ్స్ అండ్ విల్లాస్ అధినేత రాయల రాజాను శనివారం సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ తరహాలో బొమ్మరిల్లు సంస్థ కూడా కృష్ణా జిల్లాలో కోట్ల రూపాయలు వసూళ్లకు పాల్పడింది. ఒక్క మచిలీపట్నం పరిధిలోనే 1.5కోట్ల మొత్తాన్ని వసూలు చేయడం గమనార్హం. డబ్బులు తీసుకుని స్థలాలు రిజిస్ట్రేషన్ చేయకుండా తమని మోసం చేశారంటూ కొందరు బాధితులు 2104లో మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయగా.. తదుపరి విచారణను ప్రభుత్వం సీఐడికి అప్పగించింది.