Short News

డబ్బింగ్ పనులు ప్రారంభించిన మెగాస్టార్ అల్లుడు!

డబ్బింగ్ పనులు ప్రారంభించిన మెగాస్టార్ అల్లుడు!

కళ్యాణ్ దేవ్ వెండితెర ఆరంగేట్రం చేస్తున్న సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి అయ్యింది. "బాహుబలి" సినిమా కెమెరా మెన్ సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించనుండగా.. "రంగస్థలం" ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారు. తాజాగా చిత్ర హీరో కళ్యాణ్ దేవ్ ఈ సినిమాకు సంభందించిన డబ్బింగ్ పనులు ప్రారంభం చేసారు. తన పాత్రకు డబ్బింగ్ స్టార్ట్ చేసాడు హీరో కళ్యాణ్ దేవ్.

కోరలు చాస్తున్న 'నిపా' ..కేరళలో హై-ఎలర్ట్

కోరలు చాస్తున్న 'నిపా' ..కేరళలో హై-ఎలర్ట్

కేరళలో మొదలైన 'నిపా' కలవరంతో దేశమంతా ఉలిక్కిపడింది. ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా విస్తరించే ఈ వైరస్‌ సోకితే మరణావకాశాలు చాలా ఎక్కువ. నిపా వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. నిపా వైరస్‌ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అధికార యంత్రాంగం సరిహద్దుల్లో ముందు జాగ్రత్తలకు సిద్ధం అయింది. కేరళ సరిహద్దుల్లోని కన్యాకుమారి, తిరునల్వేలి, తేని, కోయంబత్తూరు జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేస్తూ ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతానికి ఈ వైరస్ కేరళ వరకు మాత్రమే పరిమితమై ఉంది.  
ఉత్తమ యూనివర్సిటీల్లో హెచ్‌సీయూకు 4వ స్థానం

ఉత్తమ యూనివర్సిటీల్లో హెచ్‌సీయూకు 4వ స్థానం

వీక్‌ మ్యాగజైన్‌-హన్సా రీసెర్చ్‌ ఇటీవల ఉత్తమ యూనివర్సిటీలకు సంబంధించి సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ నాలుగో స్థానం దక్కించుకుంది. దేశవ్యాప్తంగా సాగిన ఈ సర్వేలో జేఎన్‌యు, యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ, బనారస్‌ హిందూ యూనివర్సిటీలు మొదటి మూడు స్థానాలు దక్కించుకోగా హెచ్‌సీయూ నాలుగో స్థానంలో నిలిచింది. దక్షిణ భారతదేశ పరంగా హెచ్‌సీయు మొదటి స్థానంలో నిలిచింది. 2017లో వీక్‌ మ్యాగజైన్‌ సర్వేలో కూడా హెచ్‌సీయూ నాలుగో స్థానంలో నిలిచింది.
మహానటి సావిత్రిని ప్రొడక్షన్ బాయ్ కూడా, దిండు కింద 2 వేలు పెట్టి.. దయనీయ స్థితి కళ్లారా చూశా!

మహానటి సావిత్రిని ప్రొడక్షన్ బాయ్ కూడా, దిండు కింద 2 వేలు పెట్టి.. దయనీయ స్థితి కళ్లారా చూశా!

క్యారెక్టర్ రోల్స్ తో గుమ్మడి వెంకటేశ్వర రావు తిరుగులేని నటన కనబరిచారు. ఎన్నో అద్భుత చిత్రాల్లో ఆయన నటించారు. ఎన్టీఆర్, ఎన్నార్, సావిత్రి వంటి గొప్ప నటులతో ఆ తరువాత తరం నటులు చిరంజీవి, నాగార్జున వంటి నటుల చిత్రాల్లో కూడా గుమ్మడి నటించారు. ఇటీవల జరిగి ఓ ఇంటర్వ్యూలో మహానటి సావిత్రి గురించి గుమ్మడి ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించారు. సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి చిత్రం అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. సావిత్రితో కలసి తాను అనేక చిత్రాల్లో నటించానని గుమ్మడి అన్నారు. సావిత్రి నన్ను అన్నయ్య అని పిలిచేది.