Short News

కమల్ అభిమానులకు బ్యాడ్ న్యూస్

కమల్ అభిమానులకు బ్యాడ్ న్యూస్

విలక్షణ నటుడు కమల్ హాసన్ త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రకటించారు. తమిళానాడులో రాజకీయ అరంగ్రెటం చేసేందుకు కొన్ని నెలలుగా కసరత్తు చేస్తున్నారు. ధీంతో త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పేందుకు నిర్ణయించుకున్నారట. ఫిబ్రవరి చివరి లోపు పార్టీని ప్రకటించి విధివిధానాలను ప్రకటింస్తారని తెలిపారు.పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత సినిమాల్లో నటించబోనని స్పష్టం చేశారు కమల్ హసన్. 
'ఆ హింస' అనుభ‌వించిన బాలుర‌కూ భ‌రోసా ఇవ్వాలి

'ఆ హింస' అనుభ‌వించిన బాలుర‌కూ భ‌రోసా ఇవ్వాలి

లైంగిక వేధింపులకు లింగ భేదం లేదని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ‌ మంత్రి మేనకా గాంధీ అన్నారు. లైంగిక వేధింపుల‌కు గురైన బాలికలకు అండ దండలు అందిస్తున్నట్లుగానే బాధిత బాలురకు కూడా చట్టం భరోసా ఇవ్వాలన్నారు. ఛేంజ్. ఓఆర్‌జీ అనే ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫిలిం మేకర్ ఇన్సియా దారివాలా బాలురపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి పెట్టిన పిటిషన్‌పై మేన‌కా ఈ విధంగా స్పందించారు. బాలలపై లైంగిక వేధింపుల విషయంలో బాలురకు జరుగుతున్న అన్యాయం ఎక్కువగా నిర్లక్ష్యానికి గురవుతోందని మేనకా గాంధీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.   
చిరంజీవి సైరాలో తమన్నా పాత్ర అదేనట, మరోసారి తమన్నా నటవిశ్వరూపం!

చిరంజీవి సైరాలో తమన్నా పాత్ర అదేనట, మరోసారి తమన్నా నటవిశ్వరూపం!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా సైరా నరసింహారెడ్డి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. తాజాగా అమితాబ్ బచ్చన్, నయనతార ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొనడం జరిగింది. షూటింగ్ సమయంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు, స్వాతంత్ర సమరయోధుడి పాత్రలో చిరంజీవి నటించబోతున్న ఈ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. జగపతిబాబు ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు.

మెదడు క్షయ వ్యాధికి  సంబంధించి తెలుసుకోవలసిన పూర్తి వివరాలు

మెదడు క్షయ వ్యాధికి సంబంధించి తెలుసుకోవలసిన పూర్తి వివరాలు

క్షయ అనగానే దగ్గు గుర్తుకు రావడం సహజం, తద్వారా కేవలం ఊపిరి తిత్తులకు మాత్రమే క్షయ వ్యాధి కలుగుతుందని అనేకమంది భావిస్తుంటారు. కానీ క్షయ వ్యాధి అనేది, శరీరంలో ఏ భాగానికైనా రావొచ్చు. ఉదాహరణకు చర్మం, గర్భాశయం మొదలైనవి.

అదేవిధంగా మెదడుకు కూడా క్షయవ్యాధి సోకుతుంది. తద్వారా మెదడులోని రక్తనాళాలు వాపునకు గురవడం జరుగుతుంది. దీనిని మెనింజైటిస్ క్షయ వ్యాధిగా కూడా పిలుస్తారు.

మెనింజైటిస్ క్షయ, మైక్రో బాక్టీరియం క్రిమి, నాడీ మండలాన్ని కప్పే పొర లేదా మెదడుపై ప్రభావాన్ని చూపిస్తుంది.