Short News

కరీనాకపూర్‌కు చేదు అనుభవం.. ముస్లింను పెళ్లిచేసుకొన్నందుకే సిగ్గుపడాలి అంటూ..

కరీనాకపూర్‌కు చేదు అనుభవం.. ముస్లింను పెళ్లిచేసుకొన్నందుకే సిగ్గుపడాలి అంటూ..

కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన దారుణ ఘటనపై కరీనాకపూర్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. లైంగిక దాడి ఘటనకు సంబంధించిన వ్యవహారంపై తన నిరసన వ్యక్తం చూస్తూ ప్లకార్డు ప్రదర్శన నిర్వహించారు. దానికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కరీనా షేర్ చేసిన ఫోటోపై ఓ వ్యక్తి తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ నోటిదురుసును బయటపెట్టారు. మతాన్ని ఉద్దేశించి నెటిజన్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. జమ్ము, కశ్మీర్‌లోని కతువాలో ఓ చిన్నారిపై జరిగిన లైంగిక దాడిని నిరసిస్తూ తన సహచరి నటి స్వరభాస్కర్‌తో కలిసి ప్లకార్డు ప్రదర్శన నిర్వహించారు.

బ్రహ్మాజీ ఉంటే 99 శాతం విజయమే

బ్రహ్మాజీ ఉంటే 99 శాతం విజయమే

మహేశ్ బాబు నటించిన 'భరత్‌ అనే నేను' చిత్రంలో బ్రహ్మాజీ కీలక పాత్ర పోషించాడు. సీఎం భరత్‌కు పర్సనల్‌ సెక్రటరీ భాస్కర్‌ పాత్రలో హాస్యం పండించారు. విజయోత్సవ వేడుక సందర్భంగా మహేశ్‌ బ్రహ్మాజీ గురించి మాట్లాడుతూ 'నేను, బ్రహ్మాజీ నటించిన సినిమాలు 99 శాతం విజయం సాధించాయి' అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ 'అరుదైన నటుడు, నేచురల్‌ యాక్టర్‌, అతను ఏ సన్నివేశంలోనైనా హాస్యాన్ని, భావోద్వేగాన్ని పండించగలరు' అని చెప్పుకొచ్చారు.  
నింగికెగిసిన సోగ్గాడు: చిన్నబోయిన సింహపురి

నింగికెగిసిన సోగ్గాడు: చిన్నబోయిన సింహపురి

ఆనం వివేకానందరెడ్డి(67) ఎక్కడుంటే అక్కడ నవ్వులు పూస్తాయి. సింహపురి సోగ్గాడిగా పేరు తెచ్చుకున్న ఆయన మృతితో నెల్లూరు జిల్లా చిన్నబోయింది. సుమారు రెండు నెలలకు పైగా ప్రొస్టేట్ క్యాన్సర్‌తో పోరాడిన ఆయన బుధవారం ఉదయం చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. కాగా, ఈ విషయం తెలిసిన నెల్లూరు అభిమానులు, ప్రజలు విషాదంలో మునిగిపోయారు. రాజకీయాల్లో విలక్షణ నేతగా గుర్తింపు తెచ్చుకున్న వివేకానందరెడ్డి.. ఇక లేరనే విషయాన్ని జిల్లా ప్రజలు, నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.

భారీ అగ్నిప్ర‌మాదం..ధ్వంస‌మైన 'కేసరి' సెట్‌

భారీ అగ్నిప్ర‌మాదం..ధ్వంస‌మైన 'కేసరి' సెట్‌

అక్షయ్ కుమార్ నటిస్తున్న చిత్రం 'కేసరి'. అనురాగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అక్ష‌య్, క‌ర‌ణ్ జోహార్ కో-ప్రొడ్యూస‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక క‌థానాయిక‌గా ప‌రిణితీ చోప్రా న‌టిస్తుంది. ప్ర‌స్తుతం ఈ చిత్రం మ‌హారాష్ట్ర‌లోని వాయ్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. స‌రాగ‌ర్హి యుద్ధంకి సంబంధించి సీన్స్ తెర‌కెక్కించే క్ర‌మంలో కొన్ని బాంబ్ బ్లాస్ట్ సీన్స్ ప్లాన్ చేసారు. అనుకోకుండా ఒక బాంబ్ భారీగా పేల‌డంతో సెట్ అంతా ద‌గ్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది. అయితే ప్ర‌మాదంలో ఎవ‌రూ గాయ‌ప‌డ‌లేదు.