అసలే కష్టాల్లో నాని సినిమా.. పైగా తెలంగాణ ఆర్టీసీ దెబ్బ, కేటీఆర్ ఫైర్!
నాని నటించిన తాజా చిత్రం కృష్ణార్జున యుద్ధం. 8 వరుస విజయాలు తరువాత నాని నటించిన చిత్రం ఇది. మంచి అంచనాలతో ఈ చిత్రం విడుదలైంది. కానీ అభిమానుల నుంచి, సినీ క్రిటిక్స్ నుంచి ఈ చిత్రానికి భిన్నమైన స్పందన వస్తోంది. నాని జైత్ర యాత్రకు ఈ చిత్రం అడ్డుకట్ట వేసిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రానికి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. నానిని ద్విపాత్రాభినయంలో చూపించాడు. కృష్ణ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.