Short News

వివాదాస్ప‌ద సినిమా పోస్ట‌ర్ కేన్స్‌లో విడుద‌ల‌

వివాదాస్ప‌ద సినిమా పోస్ట‌ర్ కేన్స్‌లో విడుద‌ల‌

రహత్‌ కాజ్మీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లిహాఫ్‌'(మెత్తని బొంత) సినిమా తొలి పోస్టరు మాంటోలో జరుగుతున్న71వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్లో విడుదలయ్యింది. కాన్స్‌లో విడుదల చేసిన ఈ పోస్టర్లో ఒక ఎర్రని బొంత మీద ఇద్దరు మహిళల పాదాలు ఉన్నాయి. ప్రముఖ ఉర్డూ రచయిత ఇస్మై చుగ్తాయి రచించిన వివాదస్పద పుస్తకం ‘లిహాఫ్‌' ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సోనల్‌ సెహగల్‌ ‘బేగమ్‌ జాన్‌' పాత్రలో నటిస్తున్నది. భర్త నిరాదరణకు గురైన మహిళ మానసిక సరిస్థితి ఎలా ఉంటుంది, ఆ సమయంలో ఆమెను ఎలాంటి విషయాలు ఆకర్షిస్తాయనే ఇతివృత్తంతో తెరకెక్కుతోంది ఈ సినిమా.       
బ్లూటూత్ మ్యూజిక్ రిసీవర్ కు భారీగా క్రేజ్

బ్లూటూత్ మ్యూజిక్ రిసీవర్ కు భారీగా క్రేజ్

బ్లూటూత్ మ్యూజిక్ రిసీవర్ కు భారీగా క్రేజ్ పెరిగింది. వైర్‌లెస్ బ్లూటూత్ స్పీకర్ వలె ఇది కూడా బ్లూటూత్ మ్యూజిక్ రిసీవర్. కాకపోతే ఇది చాలా చిన్నది. పెన్‌డ్రైవ్‌లా ఉండే ఈ రిసీవర్‌కు బ్లూటూత్ అనుసంధానమై ఉంటుంది. దీనిని మొబైల్, కారు, హోమ్ థియేటర్, టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు. కారులో ఎక్కువసేపు పాటలువింటూ కాలక్షేపం చేసేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ రిసీవర్‌కు హెడ్‌ఫోన్స్ కూడా పెట్టుకొచ్చు. అలాగే హోమ్ థియేటర్‌కూ కనెక్ట్ చేయవచ్చు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

టీ20లీగ్ 2018లో భాగంగా పుణే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే 13 మ్యాచ్ లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 8 మ్యాచ్ ల్లో గెలిచి పాయింట్స్ పట్టికలో 2 వ స్థానంలో ఉంది. ఇక కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 13 మ్యాచ్ లు ఆడగా.. కేవలం మూడింటిలో గెలిచి పాయింట్స్ పట్టికలో కింద వరుస నుంచి రెండో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్ గెలిస్తే చెన్నై టాప్ ప్లేస్ కు చేరుకోనుంది.
వైరల్ గా రాం చరణ్, ఎన్టీఆర్ ఫొటో

వైరల్ గా రాం చరణ్, ఎన్టీఆర్ ఫొటో

నటుడు రామ్‌చరణ్‌.. తారక్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఫొటో ఒకటి వైరల్ గా మారింది. చరణ్, ఎన్టీఆర్ ను వెనక నుంచి పట్టుకుని సరదాగా ఆటపట్టిస్తున్నట్లు ఉన్న ఫొటోకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు సోదరా! ఈ ఏడాది నీకు అద్భుతంగా ఉండాలి' అని చరణ్‌ పోస్ట్ చేశారు.‌ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో రాంచరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.