Short News

మాధవీలత సంచలన పేస్ బుక్ పోస్ట్.. పవన్ కళ్యాణ్‌కు తెలిసిన నిప్పులాంటి నిజం, వెయిట్ అండ్ సీ!

మాధవీలత సంచలన పేస్ బుక్ పోస్ట్.. పవన్ కళ్యాణ్‌కు తెలిసిన నిప్పులాంటి నిజం, వెయిట్ అండ్ సీ!

కాస్టింగ్ కౌచ్ విషయంలో నటి శ్రీరెడ్డి సంచలన విషయాలు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. మాధవీలత కూడా ఈ విషయంలో తరచుగా గళం విప్పుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం తీవ్ర వివాదంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇందులో హస్తం ఉన్న బడా సెలెబ్రిటీల పేర్లనే శ్రీరెడ్డి బట్టబయలు చేసింది. మాధవీలత కూడా తనకు ఎదురైన అనుభవాలని వెల్లడించింది. తాజాగా మాధవీలత పేస్ బుక్ లో సంచలన పోస్ట్ పెట్టింది. పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ఈ పోస్ట్ ఉండడం విశేషం.

కూతురిపై తండ్రి రేప్: సంచలన తీర్పిచ్చిన కోర్టు

కూతురిపై తండ్రి రేప్: సంచలన తీర్పిచ్చిన కోర్టు

మానసిక వికలాంగురాలైన 17 ఏళ్ళ కూతురిని తల్లిని చేసిన తండ్రికి తంజావూరు మహిళా కోర్టు నాలుగు జీవిత ఖైదులను విధిస్తూ తీర్పు చెప్పింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగు చూసింది.తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా శివకొల్లై ప్రాంతానికి చెందిన సుబ్రమణి అనే వ్యక్తి పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. తన కూతురిపై అత్యాచారానికి పాల్పడి తల్లిని చేశాడు. ఈ విషయం తెలిసిన తల్లి భర్తపై ఫిర్యాదు చేసింది. ఏడాది తర్వాత తంజావూరు కోర్టు నిందితుడికి నాలుగు జీవిత ఖైదులు విధించింది.

పానిక్ అటాక్ నుండి బయటపడే సహజ మార్గాలు ఇవే ..!

పానిక్ అటాక్ నుండి బయటపడే సహజ మార్గాలు ఇవే ..!

మీరెప్పుడైనా విపరీతమైన భయానికి మరియు ఆందోళనలకు గురై, గుండె పగిలి పోతున్నట్లు, ఊపిరి ఆగిపోయినట్లు అనుభూతికి లోనయ్యారా? అనేకమంది సహజంగా ఎదుర్కునే అనుభవాలలో ఇది కూడా ఒకటి.

ఒకవేళ మీరు ఈపరిస్థితికి లోనై ఉంటే, దీనిని పానిక్ అటాక్ అని అంటారు. దీనినే ఆందోళనల దాడిగా కూడా వ్యవహరిస్తారు.

అసలేమిటి ఈ పానిక్ అటాక్:

పానిక్ అటాక్ అనేది ఆందోళనలకు సంబంధించిన ఒక మానసిక సమస్య లేదా స్థితిగా చెప్పబడుతుంది. ముఖ్యంగా మెదడు అధిక ఒత్తిడులకు లోనైనప్పుడు, లేదా భయానికి గురైనప్పుడు ఈ పరిస్థితిని సాధారణంగానే ఎదుర్కొంటూ ఉంటాము.

ఇండియా ఫస్ట్ పీఎం నెహ్రూ కాదట, గూగుల్ సంచలనం, కారణమేంటి ?

ఇండియా ఫస్ట్ పీఎం నెహ్రూ కాదట, గూగుల్ సంచలనం, కారణమేంటి ?

గూగుల్ ఇండియా సెర్చ్ బార్ జవహర్ లాల్ నెహ్రూను నరేంద్ర మోడీగా మార్చివేసింది. ఇండియా తొలి ప్రధాని అని సెర్చ్ చేస్తే, జవహర్ లాల్ నెహ్రూ బదులుగా ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో కనిపిస్తుండటంతో నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. ఇక సెర్చ్ చేస్తే తొలుతగా వికీపీడియా లింక్‌ను చూపిస్తున్న గూగుల్ సెర్చ్ బార్, పక్కనే నరేంద్ర మోమై ఫోటోను చూపిస్తోంది. ఆయన పేరును నెహ్రూగా చూపిస్తోంది. ఇక ఈ తప్పిదంపై కాంగ్రెస్ సోషల్ మీడియా తీవ్రంగా విరుచుకుపడుతోంది. గూగుల్ ఇలాంటివి చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి.