Short News

'మగధీర'గా మళ్ళీ దూకబోతున్న రాంచరణ్!

'మగధీర'గా మళ్ళీ దూకబోతున్న రాంచరణ్!

తొమ్మిదేళ్ల క్రితం మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన మగధీర చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆ సమయంలో మగధీర చిత్రం ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. దర్శక ధీరుడు రాజమౌళి ఈ చిత్రాన్ని అద్భుత దృశ్య కావ్యంగా మలిచారు. కాజల్ అగర్వాల్, రాంచరణ్ జంటగా నటించిన ఈ చిత్రం పునర్జన్మల నేపథ్యంలో ప్రేమ కథగా సాగుతోంది. రాంచరణ్ పోరాటాలు అబ్బురపరిచే విధంగా దర్శకుడు రూపొందించారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఫ్యామిలీతో న్యూయార్క్‌లో ఎంజాయ్ చేస్తున్నరేణు దేశాయ్

ఫ్యామిలీతో న్యూయార్క్‌లో ఎంజాయ్ చేస్తున్నరేణు దేశాయ్

పవన్ కల్యాన్ మాజీ భార్య రేణు దేశాయ్ తన పిల్లలు ఆకీరా నందన్, ఆద్యాలతో కలిసి వెకేషన్‌ను న్యూయార్క్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని రేణు స్వయంగా తన ఇన్‌స్టా గ్రాం ద్వారా తెలిపారు. ‘‘ఈరోజు ఆద్య, అకీరా నేను యాధృచ్చికంగా ఏ దుస్తులైతే ధరించామో అదే రంగు క్యాప్, షూస్ ధరించాం.(నా ఎత్తు 5.8 అడుగులు. 6.3 అడుగుల ఎత్తుతో అకీరా నాకంటే పొడవు ఉన్నాడు. కానీ నా లిటిల్ బేబీకి 14 ఏళ్లే)'' అంటూ ఇన్‌స్టా గ్రాంలో పోస్ట్ చేశారు.
భారత నావికదళ స్థావరాలపై దాడులకు ఉగ్రవాదుల ప్లాన్

భారత నావికదళ స్థావరాలపై దాడులకు ఉగ్రవాదుల ప్లాన్

భారత నావికదళ స్థావరాలపై దాడులు చేసేందుకు పాకిస్తాన్ టెర్రరిస్టులు సిద్ధమవుతున్నాయి. పాకిస్థాన్‌లోని భవల్పూర్‌ వద్ద జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులకు పాక్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ఐఎస్‌ఐ శిక్షణ ఇచ్చింది. ఈ శిక్షణలో భాగంగా భారత నావికాదళ స్థావరాలపై దాడులు చేసే పద్ధతులను నేర్పించారు. దీంతోపాటు సముద్రపు లోతుల్లో ఆయుధ వినియోగంపై వారికి శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. దీంతో భారత కీలక జలాంతర్గాములను నిలిపే విశాఖపట్టణం పోర్టుపై నిఘాను మరింత పెంచారు.
అవిశ్వాసానికి ఓకే కానీ: బాబుకు జేసీ ఊహించని షాక్

అవిశ్వాసానికి ఓకే కానీ: బాబుకు జేసీ ఊహించని షాక్

తెలుగుదేశం పార్టీ అనంతపురం జేసీ దివాకర్ రెడ్డి గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపు (శుక్రవారం) అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తయ్యాక తాను తన లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటన చేశారు. పార్టీలో తనకు ప్రాధాన్యం దక్కడం లేదనడంతో పాటు పలు కారణాలతో జేసీ పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాను అవిశ్వాస తీర్మానానికి హాజరుకాబోనని బుధవారం ప్రకటించారు. దీంతో టీడీపీలో కలకలం ప్రారంభమైంది. ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వం నిధుల కోసం జీవో విడుదల చేస్తే కథ సుఖాంతమవుతుందనుకున్నారు. కానీ రివర్స్ అయింది.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more