Short News

‘మహానటి’లో తొలగించిన దృశ్యాలు వైరల్

‘మహానటి’లో తొలగించిన దృశ్యాలు వైరల్

అలనాటి ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘మహానటి' ఈ సినిమా బాక్సాఫిస్ దగ్గర విజయవంతంగా దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమాలోని డిలీటెడ్ సీన్‌ అని క్యాప్షన్‌తో ఓ వీడియో క్లిప్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రియదర్శిని పేటిక ముందు కీర్తి సురేష్ మాట్లాడిన క్లిప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటివి నిజంగా ఉంటే బాగుండు.. వేరే షూటింగ్‌లో ఉన్న మా ఆయనతో ఎంచక్కా మాట్లాడుకోవచ్చునంటూ కీర్తి సురేష్ వీడియోలో చెబుతుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహేష్ @ 25 ..మీసకట్టు .. సీమ స్లాంగ్ ..

మహేష్ @ 25 ..మీసకట్టు .. సీమ స్లాంగ్ ..

ఇటీవలి కాలంలో టాలీవుడ్ హీరోలు గెట‌ప్‌లోనే కాదు భాష‌లో వైవిధ్యం చూపించేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా మ‌హేష్ బాబు త‌న త‌దుప‌రి చిత్రం కోసం రాయలసీమ భాష‌లో మాట్లాడుతాడ‌ట‌. వంశీపైడిప‌ల్లి దర్శకత్వంలో చేయనున్న ఈ చిత్ర కధ రాయ‌ల‌సీమ‌తోనే ముడిప‌డి ఉంటుంద‌ట. ముఖ్య‌మైన స‌న్నివేశాలు క‌ర్నూలులో ఉంటాయ‌ట‌. అంతేకాదు ఈ సినిమాలో మ‌హేష్ మీస‌క‌ట్టుతో క‌నిపిస్తాడ‌ని అంటున్నారు. ఈ చిత్రంలో  పూజా హెగ్డే క‌థానాయిక‌. ఈ చిత్రాన్ని దిల్‌రాజు, అశ్వనీదత్‌ కలిసి నిర్మించ‌నున్నారు.  
తొలిసారి పోలీస్ పాత్రలో ప్రభుదేవా

తొలిసారి పోలీస్ పాత్రలో ప్రభుదేవా

నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్ర‌భుదేవా కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు పోలీస్ పాత్ర‌లు చేయ‌లేదు. తొలిసారి యాక్ష‌న్ ఫ్లిక్‌లో పోలీస్ పాత్ర చేయ‌బోతున్నాడు. టిక్ టిక్ టిక్ నిర్మాత నెమిచంద్ జ‌బ‌క్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏసీ ముగ్లీ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. ప్రభుదేవా తొలిసారి పోలీస్ పాత్ర చేయ‌నున్నాడని చిత్ర నిర్మాత ట్విట్టర్ ద్వారా తెలిపారు. మ‌రి ఖాకీ దుస్తుల్లో ప్ర‌భుదేవా ప్రేక్ష‌కుల‌ని ఏ రేంజ్‌లో మెప్పిస్తాడో చూడాలి.
టీ20 లీగ్ లో శ్రేయస్‌ గోపాల్‌ అరుదైన ఘనత

టీ20 లీగ్ లో శ్రేయస్‌ గోపాల్‌ అరుదైన ఘనత

రాజస్థాన్‌ స్పిన్నర్‌ శ్రేయస్‌ గోపాల్‌ అరుదైన ఘనత సాధించాడు. టీ20 లీగ్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన ఆటగాళ్ళ జాబితాలో గోపాల్‌ ఐదో స్థానంలో నిలిచాడు. శనివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గోపాల్‌ 16 పరుగులిచ్చి 4 వికెట్లు తీసాడు. ఈ జాబితాలో అంకిత్‌ రాజ్‌పుత్ ‌(5/14) తొలి స్థానంలో ఉండగా, అజిత్‌ చండీల్లా(4/13) రెండో స్థానంలో, అరవింద్‌(4/14) మూడో స్థానంలో, భాటియా(4/15) నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానాన్ని శ్రేయస్‌ గోపాల్‌ ఆక‍్రమించాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది.