Short News

రెండు రోజుల్లో 'మహానటి'కి మూడు మిలియన్లు

రెండు రోజుల్లో 'మహానటి'కి మూడు మిలియన్లు

సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా 'మహానటి'. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. 'అనగనగా ఒక మహానటి' అంటూ ప్రారంభమైన ఈ టీజర్ నిడివి తక్కువగా ఉన్నప్పటికీ నెటిజన్ల నుండి మంచి స్పందన తెచ్చుకుంటోంది. శనివారం సాయంత్రం విడుదలై ఇప్పటివరకు 3 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేష్‌, జెమినీ గణేశన్‌గా దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. సమంత, విజయ్ దేవరకొండ, షాలినీ పాండే ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
మన్నించు.. ఇషాన్ ..బలంగా నిలబడు

మన్నించు.. ఇషాన్ ..బలంగా నిలబడు

మంగళవారం రాత్రి  బెంగళూరుతో మ్యాచ్‌లో ముంబయి వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ దెబ్బ తిన్నాడు. హార్దిక్‌ పాండ్య విసిరిన త్రో బలంగా అతడి కంటి పక్కన తాకింది. ఆ దెబ్బకు అతను బాధతో విలవిలలాడిపోయాడు. మైదానాన్ని కూడా విడిచి వెళ్ళిపోయాడు. తన వల్లే ఇషాన్‌ గాయపడటంతో హార్దిక్‌ కూడా చాలా బాధపడ్డాడు. మ్యాచ్‌ తర్వాతి రోజు ఇషాన్‌ను కలిసిన పాండ్య అతడితో ఫొటో దిగి ట్విటర్లో పంచుకున్నాడు. 'నా ప్రియమైన సోదరుడా.. మన్నించు. బలంగా నిలబడు' అని కామెంట్ చేసాడు.
''రాహు కాలం'' చూసుకుని మ‌రీ నామినేష‌న్ వేశారు.. ఎందుకంటే...

''రాహు కాలం'' చూసుకుని మ‌రీ నామినేష‌న్ వేశారు.. ఎందుకంటే...

రాజ‌కీయ నాయ‌కులు మంచి ముహూర్తం చూసుకొని ఎన్నికల్లో నామినేషన్ వేయడం మ‌న‌కు తెలిసిందే. కానీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బెళ‌గావి నుంచి కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేస్తున్న సతీష్ జార్కీహోలీ రాహు కాలంలో తన నామినేషన్ వేసి సంచలనం రేపారు. మూఢ నమ్మకాలను పారదోలాలనే తన ప్రచారోద్యమంలో భాగంగా తాను రాహుకాలం సమయంలో నామినేషన్ వేసినట్లు సతీష్ వెల్లడించారు. ‘‘నేను నా నియోజకవర్గంలో ఎన్నో మంచి పనులు చేశాను, ప్రజల మద్ధతు నాకే ఉంది. అందుకే రాహుకాలంలోనే నామినేషన్ వేశాను. అయినా విజయం నాదే '' అని సతీష్ ధీమాగా చెప్పారు.    
కళ్యాణ్ రామ్ సరసన ఆ ఇద్దరు హీరోయిన్స్. దర్శకుడు అతడే!

కళ్యాణ్ రామ్ సరసన ఆ ఇద్దరు హీరోయిన్స్. దర్శకుడు అతడే!

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఎంఎల్ఎ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో త్వరలో నా నువ్వు సినిమాను విడుదల చెయ్యబోతున్నాడు. జయేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గ నటిస్తోంది. తాజాగా కళ్యాణ్ రామ్ ఆర్య, అతడు, జల్సా, దూకుడు వంటి హిట్ చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేసిన గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేయనున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంభందించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.