Short News

‘మహానటి’ టీజర్ కు భారీ రెస్పాన్స్
<iframe width="697" height="361" src="https://www.youtube.com/embed/OrnYMmWBuV4" frameborder="0" allow="autoplay; encrypted-media" allowfullscreen></iframe>

‘మహానటి’ టీజర్ కు భారీ రెస్పాన్స్

అలనాటి అందాల తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మహానటి. ఈ సినిమా టీజర్,పోస్టర్ కుమంచి రెస్పాన్స్ వస్తోంది. విడుద‌లైన కొన్ని గంట‌ల‌లోనే టీజ‌ర్ మిలియ‌న్‌కి పైగా వ్యూస్ సాధించింది. నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్న మ‌హాన‌టి చిత్రంలో సావిత్రి పాత్రని కీర్తి సురేష్ పోషించ‌గా, మధుర వాణి అనే జర్నలిస్ట్ పాత్రలో సమంత, విజయ్ ఆంటోని పాత్రలో విజయ్ దేవరకొండ, జెమిని గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ , ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు న‌టిస్తున్నారు. మహానటి తమిళంలోను విడుదల కానుంది. ‘నడిగర్ తిలగమ్' అనే టైటిల్ తో ఈ మూవీ కోలీవుడ్ లో విడుదల కానుంది.
చంద్రబాబుకు గవర్నర్ ఫోన్

చంద్రబాబుకు గవర్నర్ ఫోన్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ బుధవారం సాయంత్రం ఫోన్ చేశారు. విశాఖ, శ్రీకాకుళంలోని సముద్ర తీరప్రాంత పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. తీరప్రాంతంలో విపరీత వాతావరణ పరిస్థితులపై ఫోన్‌లో అడిగి తెలుసుకున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచాలని, నిత్యావసర వస్తువులు, సహాయ సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. దక్షిణ మహాసముద్రంలో అల్పపీడన ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా తయారైంది. ఉత్తర కోస్తా సముద్రతీరంలో అలల ఉద్ధృతి పెరిగింది.

బ్రహ్మాజీ ఉంటే 99 శాతం విజయమే

బ్రహ్మాజీ ఉంటే 99 శాతం విజయమే

మహేశ్ బాబు నటించిన 'భరత్‌ అనే నేను' చిత్రంలో బ్రహ్మాజీ కీలక పాత్ర పోషించాడు. సీఎం భరత్‌కు పర్సనల్‌ సెక్రటరీ భాస్కర్‌ పాత్రలో హాస్యం పండించారు. విజయోత్సవ వేడుక సందర్భంగా మహేశ్‌ బ్రహ్మాజీ గురించి మాట్లాడుతూ 'నేను, బ్రహ్మాజీ నటించిన సినిమాలు 99 శాతం విజయం సాధించాయి' అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ 'అరుదైన నటుడు, నేచురల్‌ యాక్టర్‌, అతను ఏ సన్నివేశంలోనైనా హాస్యాన్ని, భావోద్వేగాన్ని పండించగలరు' అని చెప్పుకొచ్చారు.  
నింగికెగిసిన సోగ్గాడు: చిన్నబోయిన సింహపురి

నింగికెగిసిన సోగ్గాడు: చిన్నబోయిన సింహపురి

ఆనం వివేకానందరెడ్డి(67) ఎక్కడుంటే అక్కడ నవ్వులు పూస్తాయి. సింహపురి సోగ్గాడిగా పేరు తెచ్చుకున్న ఆయన మృతితో నెల్లూరు జిల్లా చిన్నబోయింది. సుమారు రెండు నెలలకు పైగా ప్రొస్టేట్ క్యాన్సర్‌తో పోరాడిన ఆయన బుధవారం ఉదయం చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. కాగా, ఈ విషయం తెలిసిన నెల్లూరు అభిమానులు, ప్రజలు విషాదంలో మునిగిపోయారు. రాజకీయాల్లో విలక్షణ నేతగా గుర్తింపు తెచ్చుకున్న వివేకానందరెడ్డి.. ఇక లేరనే విషయాన్ని జిల్లా ప్రజలు, నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.