Short News

సుష్మాజీ సాయం చేయండి ..ప్లీజ్

సుష్మాజీ సాయం చేయండి ..ప్లీజ్

బాలీవుడ్‌ నటి మల్లికా షెరావత్‌ భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ సాయం కోరింది. తన స్నేహితురాలి వీసా విషయంలో చొరవ చూపాలంటూ ట్విట్టర్‌ వేదికగా ఆమె పలు ట్వీట్లు చేసింది. 'ఫ్రీ ఏ గర్ల్‌' అనే ఓ డచ్‌ ఎన్జీవో సంస్థ సహ వ్యవస్థాపకురాలు ఎవెలిన్‌ హెల్స్‌కెన్‌ భారత్‌లో సంస్థ సేవలు అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆమెకు భారత వీసా దొరకలేదు. ఈ నేపధ్యంలో మల్లికా షరావత్‌ విజ్ఞప్తి చేసింది. 
ఓవర్సీస్ బాక్సాఫీస్ ప్రిన్స్ మహేష్‌ పంజా.. అమెరికాలో ‘భరత్’ సరికొత్త రికార్డు!

ఓవర్సీస్ బాక్సాఫీస్ ప్రిన్స్ మహేష్‌ పంజా.. అమెరికాలో ‘భరత్’ సరికొత్త రికార్డు!

ప్రిన్స్ మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన భరత్ అనే నేను చిత్రం కలెక్షన్ల పంట పండిస్తున్నది. ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తూ రూ.150 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తున్నది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో నాన్ బాహుబలి చిత్రాల రికార్డులను తిరగరాస్తున్నది. అమెరికాలో భరత్ అనే నేను సరికొత్త రికార్డును నెలకొల్పింది.అమెరికాలో ప్రిన్స్ మహేష్ చిత్రం కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నది. గత వారం రోజులో భరత్ అనే నేను రూ.17 కోట్లు ( 2.6 మిలియన్లు) వసూలు చేసింది.

'మొబైల్ నెంబ‌ర్‌తో ఆధార్ అనుసంధానం త‌ప్ప‌నిస‌ర‌ని చెప్ప‌లేదు'

'మొబైల్ నెంబ‌ర్‌తో ఆధార్ అనుసంధానం త‌ప్ప‌నిస‌ర‌ని చెప్ప‌లేదు'

మొబైల్ ఫోన్ నంబర్‌తో ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయాలంటూ తాము ఎప్పుడూ చెప్పలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2017 ఫిబ్రవరి 6న ఇచ్చిన తీర్పును కేంద్రం ప్రభుత్వం తప్పుగా అర్థం చేసుకుందని వ్యాఖ్యానించింది. ‘‘లోక్‌నీతి ఫౌండేషన్ కేసులో సిమ్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాలని సుప్రీంకోర్టు చెప్పలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆధార్ అనుసంధానం తప్పనిసరి అంటూ తన ఆదేశాల్లో పేర్కొంది. అలా చేయమని సుప్రీంకోర్టు చెప్పలేదు..'' అని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. మొబైల్ నంబర్ వినియోగదారుల గుర్తింపును ధ్రువీకరించాలని చెప్పామని వెల్లడించింది.     
బాబు తొందరపాటు, జగన్ ఎన్డీయేలో చేరాలి: కేంద్రమంత్రి

బాబు తొందరపాటు, జగన్ ఎన్డీయేలో చేరాలి: కేంద్రమంత్రి

ఎన్డీయే నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు రావడం తొందరపాటు చర్య అని కేంద్రమంత్రి రామదాస్ అథవాలే గురువారం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి ఎన్డీయేలో చేరాలని ఆయన హితవు పలికారు. లేదంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అయినా చేరాలన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తిరిగి ఎన్డీయేలో చేరితే స్వాగతిస్తామని అథవాలే అన్నారు. టీడీపీ చేరకుంటే వైసీపీ చేరవచ్చునని వెల్లడించారు. అయితే ఎన్నికలకు ముందా తర్వాత అనేది వారి ఇష్టానికి వదిలేస్తున్నామని చెప్పారు.