
ప్రిన్స్ మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన భరత్ అనే నేను చిత్రం కలెక్షన్ల పంట పండిస్తున్నది. ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తూ రూ.150 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తున్నది. ఈ చిత్రం ఓవర్సీస్లో నాన్ బాహుబలి చిత్రాల రికార్డులను తిరగరాస్తున్నది. అమెరికాలో భరత్ అనే నేను సరికొత్త రికార్డును నెలకొల్పింది.అమెరికాలో ప్రిన్స్ మహేష్ చిత్రం కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నది. గత వారం రోజులో భరత్ అనే నేను రూ.17 కోట్లు ( 2.6 మిలియన్లు) వసూలు చేసింది.
ఎన్డీయే నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు రావడం తొందరపాటు చర్య అని కేంద్రమంత్రి రామదాస్ అథవాలే గురువారం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి ఎన్డీయేలో చేరాలని ఆయన హితవు పలికారు. లేదంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అయినా చేరాలన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తిరిగి ఎన్డీయేలో చేరితే స్వాగతిస్తామని అథవాలే అన్నారు. టీడీపీ చేరకుంటే వైసీపీ చేరవచ్చునని వెల్లడించారు. అయితే ఎన్నికలకు ముందా తర్వాత అనేది వారి ఇష్టానికి వదిలేస్తున్నామని చెప్పారు.