పవర్ స్టార్ కోసం మహేష్ సోదరి రాసుకున్న కథ ఇదే.. పవనే పర్ఫెక్ట్..!
తాను తెరకెక్కించిన 'మనసుకు నచ్చింది' చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు సూపర్ స్టార్ మహేష్ సోదరి మంజుల. మనసు కు నచ్చింది చిత్రం ఈ నెల 16 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా మంజుల తరచుగా పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన తీసుకుని రావడం సినీ ఇండస్ట్రీలో చర్చ నియాంశంగా మారింది. ఇటీవల మంజుల పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కోసం తాను ఓ కథని రాసుకున్నానని ఆయన ఒకే అంటే సినిమా చేస్తానంటూ ప్రకటించారు.