Short News

బొద్దుగా మారి షాకిచ్చిన ముద్దుగుమ్మ

బొద్దుగా మారి షాకిచ్చిన ముద్దుగుమ్మ

మ‌ల‌యాళ అమ్మాయి మీరాజాస్మిన్ గుర్తుందా.! అమ్మాయి బాగుంది చిత్రంతో తెలుగు తెర‌కి ప‌రిచ‌యమైన ఈ ముద్దుగుమ్మ ప‌వ‌న్ క‌ళ్యాణ్ 'గుడుంబా శంక‌ర్‌', ర‌వితేజ 'భ‌ద్ర‌'లోను న‌టించింది. ఆ త‌ర్వాత త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌లో అడ‌పాద‌డ‌పా సినిమాలు చేసి పెళ్ళి చేసుకుని 2016 లో సినిమాల‌కి గుడ్ బై చెప్పింది. తాజాగా ఈ అమ్మ‌డు జ్యూయ‌ల‌రీ షాప్‌లో త‌ళుక్కుమంది. ముద్దుగా ఉండే ఈ భామ బొద్దుగా అయ్యేసరికి అభిమానులు నీరసపడిపోతున్నారు.
11 పాయింట్లు వద్దు ..21 పాయింట్లే కావాలి

11 పాయింట్లు వద్దు ..21 పాయింట్లే కావాలి

ప్రపంచ బ్యాడ్మింటన్‌లోకి కొత్తగా రానున్న 11 పాయింట్ల విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానాన్ని కొందరు సానుకూలంగా ఉన్నా కొందరు వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం 21 పాయింట్ల చొప్పున గరిష్టంగా నిర్వహిస్తున్న మూడు గేమ్‌ల స్థానంలో 11 పాయింట్ల చొప్పున గరిష్టంగా 5 గేమ్‌లు ఆడించాలని భావిస్తున్నారు. మే 19న జరిగే బీడబ్ల్యూఎఫ్‌ వార్షిక సమావేశంలో ఈ ప్రతిపాదన చర్చకు రానుంది.
వనపర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు అక్కడిక్కడే మృతి..

వనపర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు అక్కడిక్కడే మృతి..

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడ్డవారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు సమాచారం. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.

తెలుగోళ్ళు  అందాల 'బొమ్మ'గానే చూపించారు

తెలుగోళ్ళు అందాల 'బొమ్మ'గానే చూపించారు

'దేవదాసు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నడుము సుందరి 'ఇలియానా'. తెలుగు పరిశ్రమ తనను అందాల వస్తువుగానే చూసిందని ఆవేదనగా చెప్పింది. ఒక ఇంటర్వూలో మాట్లాడుతూ నాలుగైదు చిత్రాల తర్వాత కూడా తనను అందాల వస్తువుగానే చూపించడం ఇబ్బందికరంగానూ, బాధగానూ అనిపించినట్లు చెప్పింది. అసలు ఆట సినిమా చేయకూడదనుకున్నట్లుగా తెలిపిన ఈ గోవా భామ జల్సా, కిక్ చిత్రాలకు మంచి మార్కులేసింది.