Short News

'మెహబూబా' ..ఓ ప్రియా.. నా ప్రియా'
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/xg-WgaOUjew" frameborder="0" allow="autoplay; encrypted-media" allowfullscreen></iframe>

'మెహబూబా' ..ఓ ప్రియా.. నా ప్రియా'

ఆకాష్‌ పూరిని హీరోగా రీ-ఎంట్రీ చేస్తూ పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన చిత్రం  'మెహబూబా'. 1971లో జరిగిన ఇండో-పాక్‌ యుద్ధ నేపథ్యంలో జరిగే లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌, ట్రైలర్స్‌కి హ్యూజ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. నేహాశెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్‌ని విడుదలయింది. 'ఓ ప్రియా.. నా ప్రియా' అంటూ సాగే సాంగ్‌లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ చిత్రాన్ని మే 11న రిలీజ్‌ చేస్తున్నారు.
నాది కూడా కథువా ఘటనలాంటిందే

నాది కూడా కథువా ఘటనలాంటిందే

బుధవారం సాయంత్రం కథువా బాధిత చిన్నారి కోసం ఓ ఎన్జీవో నిర్వహించిన శాంతి ర్యాలీలో టీమిండియా పేసర్‌ మహ‍్మద్‌ షమీ భార్య హసిన్‌ జహాన్‌ పాల్గొంది. ఈ సందర్భంగా హసిన్‌ షాకింగ్‌ కామెంట్లు చేశారు. తన వ్యవహారాన్ని కథువా హత్యాచార ఘటనతో పోల్చుకుంది. ఒక రకంగా తాను కూడా కథువా తరహా బాధితురాలినే. కానీ, ఆ చిన్నారి చనిపోతే.. తానింకా బతికున్నానని.. కథువా ఘటనలో ఏవేం జరిగాయో.. తన క్కూడా దాదాపు అలాంటి పరిస్థితులే ఎదురయ్యాయన్నారు.
అబ్బో..మన్మోహన్ లా నటించడం కష్టంగా ఉంది

అబ్బో..మన్మోహన్ లా నటించడం కష్టంగా ఉంది

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్ర పోషించడం చాలా కష్టంగా ఉందన్నారు బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్. ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్'లో ఆయన మన్మోహన్‌సింగ్ పాత్రను పోషిస్తున్నారు. తాను ఈ సినిమా కోసం నాలుగు నెలల పాటు మన్మోహన్‌సింగ్ చరిత్రను అధ్యయనం చేశానని తెలిపారు. ఎంతో కష్టమైన పాత్రను పోషిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ పాత్ర పోషించడం తన సినీ కెరీర్ లో సవాల్ గా నిలిచిందన్నారు అనుపమ్‌ఖేర్.  
కన్నా అస్వస్థతకు కారణం అదేనా?...అయినా వైసిపిలో చేరతారా?

కన్నా అస్వస్థతకు కారణం అదేనా?...అయినా వైసిపిలో చేరతారా?

గుంటూరు:వైసిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్న మాజీ మంత్రి, బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారే విషయం అనూహ్య పరిణామాల నేపథ్యంలో నిరవధికంగా వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ప్రతిష్ట అడుగంటుతున్న నేపథ్యంలో తమ రాజకీయ మనుగడ దృష్ట్యా పలు కీలక నేతలు ఆ పార్టీ నుంచి బైటపడేందుకు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీనియర్ నేత, మాజీ మంత్రి, బిజెపి నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ వైసిపిలో చేరేందుకు సర్వ సన్నద్దం అయినట్లు సమాచారం.