Short News

అల్లు అర్జున్ 'ఫైటర్' ఆల్సో  ..'లవర్' ఆల్సో
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/ApLzE-TLBYU" frameborder="0" allow="autoplay; encrypted-media" allowfullscreen></iframe>

అల్లు అర్జున్ 'ఫైటర్' ఆల్సో ..'లవర్' ఆల్సో

అల్లు అర్జున్‌ నటిస్తున్న చిత్రం 'నా పేరు సూర్య‌'. రచయిత వ‌క్కంతం వంశీ దర్శకుడిగా మారి తెర‌కెక్కిస్తున్న చిత్రానికి విశాల్‌- శేఖ‌ర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ల‌వ‌ర్స్ డే సంద‌ర్భంగా చిత్రంలోని 'ల‌వ‌ర్ ఆల్సో.. ఫైట‌ర్ ఆల్సో' పాట‌ని రిలీజ్ చేసారు. అర్జున్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అనూ ఎమ్మాన్యుయేల్ నాయిక. ఏప్రిల్ 26న ఈ చిత్రం తెలుగుతో పాటు మ‌ల‌యాళం, హిందీ, తమిళం, మరాఠి, బెంగాలీ, భోజ్ పురిలో విడుద‌ల కానుంది.
భర్త చనిపోయాక మరో వ్యక్తితో సహజీవనం

భర్త చనిపోయాక మరో వ్యక్తితో సహజీవనం

రెండేళ్ళుగా సహజీవనం చేస్తూ వివాహం చేసుకోవడానికి నిరాకరించిన ప్రియుడిని ప్రియురాలు హత్య చేసింది. అయితే ఈ కేసులో ప్రియురాలు పాత్ర నిర్ధారణ కావడంతో పూణె సిటీ సెషన్స్ కోర్టు నిందితురాలికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. సహజీవనం చేస్తున్న హనుమంతును వివాహం చేసుకోవాలని ప్రియురాలు సరిత కోరింది. అయితే అప్పటికే వివాహమై పిల్లలున్నా హనుమంతు నిరాకరించడంతో దీంతో సరిత హనుమంతును హత్యచేసింది. ఈ కేసులో సరితకు కోర్టు జీవిత ఖైదును విధించింది.

మేఘ అస్సలు ఊరుకోవడం లేదుగా..నితిన్ ని ఎలా బెదరగొడుతోందో విన్నారా..లిరికల్ సాంగ్!

మేఘ అస్సలు ఊరుకోవడం లేదుగా..నితిన్ ని ఎలా బెదరగొడుతోందో విన్నారా..లిరికల్ సాంగ్!

నితిన్ నటిస్తున్న మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ కావడంతో చల్ మోహన్ రంగ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. తాజగా చిత్ర యూనిట్ ఆహ్లాదకరమైన మెలోడీ సాంగ్ ని విడుదల చేసింది. నితిన్, హీరోయిన్ మేఘ ఆకాష్ మధ్య సంభాషణతో ఈ సాంగ్ ప్రారంభం అవుతుంది. ఈ సాంగ్ చాలా అందంగా ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. సంగీతం వినసొంపుగా ఉంటూ పాట వెంటనే నచ్చేసేలా ఉంది. తమన్ జోరు చూస్తుంటే మరో సూపర్ హిట్ ఆల్బమ్ ఛల్ మోహన్ రంగ చిత్ర రూపంలో రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

టీ20లు లేకుంటే క్రికెట్‌ మనుగడ కష్టమే

టీ20లు లేకుంటే క్రికెట్‌ మనుగడ కష్టమే

టీ20 లేకుంటే క్రికెట్‌ మనుగడ కష్టమేనని భారత మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ అన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం భారత జట్టు శ్రీలంకలో ముక్కోణపు టీ20 టోర్నీ ఆడనుండటంపై స్పందించాడు. మరోవైపు మూడో మ్యాచ్‌లో గెలిచి టీమిండియా టీ20 సిరీస్‌ సొంతం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేసాడు. మనీష్‌ పాండే, హర్ధిక్‌ పాండ్యలు భారత జట్టులో సెహ్వాగ్‌, హర్భజన్‌లా జట్టులో కీలక ఆటగాళ్ళుగా మారడానికి సమయం పడుతుందన్నాడు.