మిలటరీ మాధవరంలో ‘నా పేరు సూర్య’ వేడుక?
ఎంటర్ టైన్మెంట్
- 6 days ago
'నా పేరు సూర్య' నిర్మాతలు ఏప్రిల్ 29న భారీ ఎత్తున ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం మిలటరీ మాధవరం అనే ఊరిలో ప్లాన్ చేశారట. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో ఈ ఊరు ఉంది. ఇక్కడ చిన్న వేడుక ప్లాన్ చేయడానికి ప్రత్యేక కారణం ఉందని అంటున్నారు. 'నా పేరు సూర్య' చిత్రంలో హీరో సోల్జర్ కావడం, మిటరీ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో........ మిలటరీ మాధవరంపై దర్శక నిర్మాతల దృష్టి పడింది. ఇంటి నుండి ఒకరు ఆర్మీలో ఉండటం ఈ ఊరి ప్రత్యేకత.