ఏప్రిల్ 22న మిలటరీ మాధవరంలో 'నా పేరు సూర్య' ఆడియో
ఎంటర్ టైన్మెంట్
- 10 days ago
అల్లు అర్జున్ తాజా చిత్రం 'నా పేరు సూర్య'. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 4న విడుదల కానుంది. ఈ మూవీలో బన్నీ ఆర్మీ ఆఫీసర్గా కనిపించనున్నాడు. అను ఎమ్మాన్యుయేల్ నాయికగా నటించిన చిత్ర ఆడియో వేడుకను పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని 'మిలటరీ మాధవరం'లో ఏప్రిల్ 22న జరపనున్నారు. ఆ ఊరిలో ప్రతి ఇంటి నుండి ఒకరు మిలిటరీలో ఉన్నారు. ఆర్మీ నేపథ్యంలో సాగే చిత్రం మే4న విడుదల కానుంది.