Short News

నాగశౌర్య 'అమ్మమ్మ గారి ఇల్లు' చూసారా.!

నాగశౌర్య 'అమ్మమ్మ గారి ఇల్లు' చూసారా.!

నాగ‌శౌర్య‌, షామిలి జంట‌గా నటిస్తున్న చిత్రం 'అమ్మమ్మగారిల్లు'. సుంద‌ర్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా ప‍్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటోంది. ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌ విడుద‌ల చేసారు. పూర్తి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవ‌కాశం ఉంది. ఈ సినిమాకు రాజేష్, కె.ఆర్ నిర్మాతలు.
అధికారుల‌కు షేక్ హ్యాండ్ ఇస్తేనే పౌర‌స‌త్వం!

అధికారుల‌కు షేక్ హ్యాండ్ ఇస్తేనే పౌర‌స‌త్వం!

పౌరసత్వ వేడుకలో అధికారులకు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు నిరాకరించిందనే కారణంగా ఓ ముస్లిం మహిళకు పౌరసత్వం కల్పించకూడదని ఫ్రాన్స్ ప్రభుత్వం నిర్ణయించింది. అల్జీరియాకు చెందిన ముస్లిం మహిళ 2010లో ఫ్రాన్స్‌కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి పౌరసత్వం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తూనే ఉంది. కానీ ఫ్రాన్స్ ప్ర‌భుత్వం నిబంధ‌న‌లు పాటించ‌డానికి ఆమె ఒప్పుకోవ‌డం లేదు. తాను మతాచారాలను గౌరవిస్తానని.. అందుకే అధికారులతో చేతులు కలపడానికి నిరాకరించినట్లు పేర్కొంది. 
రామ్ గోపాల్ వర్మ అతడి బంధువే: మళ్లీ పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్స్

రామ్ గోపాల్ వర్మ అతడి బంధువే: మళ్లీ పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్స్

తన తల్లిని తిట్టించి అత్యంత నీచానికి ఒడిగట్టారంటూ ఆగ్రహంతో ఊగి పోతున్న పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై మరింత సీరియస్‌గా ముందుకు సాగుతున్నారు. శుక్రవారం ఫిలిం ఛాంబర్ నుండి వెళ్లిపోయిన తర్వాత ఆయన మరోసారి వరుస ట్వీట్లతో ట్విట్టర్‌ను హోరెత్తించారు. తాజా ట్వీట్లలో శ్రీనిరాజు అనే వ్యక్తితో రామ్ గోపాల్ వర్మకు ఉన్న సంబంధాన్ని వివరిస్తూ పవన్ కళ్యాణ్ ట్వీట్స్ చేశారు. సత్యం రామలింగ రాజుకు శ్రీనిరాజు క్లోజ్ రిలేటివ్ అని, పరోక్షంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కూడా శ్రీనిరాజు బంధువే అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

ర్యాంప్‌పై మ‌ళ్లీ మెరిసిన మాజీ ప్రేమ జంట‌

ర్యాంప్‌పై మ‌ళ్లీ మెరిసిన మాజీ ప్రేమ జంట‌

మాజీ ప్రేమికులు ర‌ణ‌బీర్‌, దీపికా ఈ మ‌ధ్య ఈవెంట్స్ లో సంద‌డి చేస్తున్నారు. తాజాగా ముంబయిలో జరిగిన 2018 మిజ్వాన్‌ ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. ఇద్దరూ చేతిలో చేయి వేసుకుని ర్యాంప్ వాక్‌ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఫ్యాష‌న్ డిజైన‌ర్ మ‌నీష్ మ‌ల్హోత్రా డిజైన్ చేసిన షేర్వాణీలో రణ్‌బీర్‌, లెహెంగాలో దీపిక మెరిసిపోయారు. ఈ షో ద్వారా వ‌చ్చిన మ‌నీని ప్రముఖ నటి షబానా అజ్మీ ఏర్పాటు చేసిన మిజ్వాన్‌ ఎన్జీవోకు విరాళంగా ఇవ్వ‌నున్నారు. ఫ్యాష‌న్ షోకి బాలీవుడ్‌ ప్రముఖులు షబానా అజ్మీ హాజ‌ర‌య్యారు.