ఒక దర్శకుడికి నాని ఝలక్ మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్!
నాని నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమా ఇటీవల విడుదలై ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక పోయింది. ఈ సినిమా తరువాత నాని నటిస్తోన్న సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. నాగార్జున నటిస్తోన్న ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అస్వినిదత్ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా తరువాత నాని చెయ్యబోయే సినిమా గురించి ఒక న్యూస్ బయటికి వచ్చింది.