Short News

కరీనా కపూర్‌పై నెటిజన్లు ఆగ్రహం

కరీనా కపూర్‌పై నెటిజన్లు ఆగ్రహం

బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ముస్లిం అయిన సైఫ్‌ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకున్నందుకు ఆగ్రహం వెల్లగక్కుతున్నారు. కథువా అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్‌ కరీనాను ఉద్దేశిస్తూ ‘ఒక హిందూ అయివుండి ముస్లింను పెళ్లి చేసుకున్నందుకు కరీనా సిగ్గు పడాలి. పైగా వారికి పుట్టిన కుమారుడికి తైమూర్‌ అని ఓ రాక్షసుడి పేరు పెట్టారు అని ట్వీట్‌ చేశాడు. దీనిపై బాలీవుడ్‌ నటి స్వరా భాస్కర్‌ దీటుగా సమాధానమిచ్చారు. అసలు నీలాంటి వాడు ఈ భూమ్మీద ఉన్నందుకు సిగ్గుగా ఉందన్నారు.
రూ.2,253 కోట్ల హవాల రాకెట్ గుట్టురట్టు

రూ.2,253 కోట్ల హవాల రాకెట్ గుట్టురట్టు

ముంబైలో హవాలా రాకెట్ గుట్టురట్టయింది. మహ్మద్‌ ఫరూక్‌ అలియాస్‌ ఫరూక్‌ షేక్‌ అనే వ్యక్తి దాదాపు రూ.2,253 కోట్ల మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. మనీ లాండరింగ్‌ నివారణ చట్టం కింద ఫరూక్‌ను అధికారులు అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. నకిలీ దిగుమతి డాక్యుమెంట్ల ద్వారా కోట్ల రూపాయలను విదేశాలకు తరలించడానికి ఫరూక్‌ 13 కంపెనీలను వాడినట్టు ఆరోపణలు ఉన్నాయి. అతన్ని ఏప్రిల్‌ 26 వరకు ఈడీ తన కస్టడీలోకి తీసుకుంది.
మహానటి సినిమా లేటెస్ట్ న్యూస్, చిత్ర యూనిట్ అంతా ఒక్క చోటికి!

మహానటి సినిమా లేటెస్ట్ న్యూస్, చిత్ర యూనిట్ అంతా ఒక్క చోటికి!

మహానటి సినిమాలో నటించిన నటీనటుల పాత్రలు త్వరలో పోస్టర్స్ ద్వారా విడుదల చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. మే ఒకటిన ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ గా చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ''తరాలను నిర్మించే స్త్రీ జాతి కోసం.. తరతరాలు గర్వించే కథ మహానటి సావిత్రి కథ''. తన అంద చందాలతోనే కాదు, గుణగణాలతోను ఇప్పటికీ తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటి మహానటి సావిత్రి. ఈ మహానటి రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోను ఎందరికో స్పూర్తిదాయకంగా నిలిచింది.

క్యాన్సర్‌తో భాదపడుతున్న నటి, మెగాస్టార్ సాయం.. స్వయంగా ఇంటికి వెళ్లిన చిరు కుమార్తె శ్రీజ!

క్యాన్సర్‌తో భాదపడుతున్న నటి, మెగాస్టార్ సాయం.. స్వయంగా ఇంటికి వెళ్లిన చిరు కుమార్తె శ్రీజ!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా చిత్ర షూటింగ్ తో బిజీగా గడుపుతున్నారు. ఆపదలో కష్టాల్లో ఉన్న ఎవరికైనా సాయమా అందించే స్వభావం చిరంజీవి సొంతం. సీనియర్ నటి సుభాషిణి గత కొంతకాలంగా క్యాన్సర్ తో బదపడుతున్నారు. ఆమె పలు టాలీవుడ్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ స్వయంగా సుభాషిణి ఇంటికి వెళ్లి ఆమెని పరామర్శించడం విశేషం. సుభాషిణి ఆరోగ్యం గురించి ఆరా తీసిన శ్రీజ రూ 2 లక్షల ఆర్థిక సాయం అందజేయడం విశేషం.