Short News

నితిన్ కల్యాణానికి కొత్త ముహూర్తం కుదిరింది!

నితిన్ కల్యాణానికి కొత్త ముహూర్తం కుదిరింది!

నితిన్ నటిస్తున్న తాజగా చిత్రం శ్రీనివాస కళ్యాణం. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్నారు. సాంప్రదాయ వివాహబంధ విలువని తెలియజెప్పేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నితిన్, రాశి ఖన్నా ఈ చిత్రంలో జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే.దాదాపు 15 ఏళ్ల తరువాత నితిన్ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి2003 లో వచ్చిన దిల్ చిత్రం తరువాత నితిన్, దిల్ రాజు కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇదే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

తొలిసారి చిన్నారిపై పాట రూపొందించిన వ‌ర్మ‌

తొలిసారి చిన్నారిపై పాట రూపొందించిన వ‌ర్మ‌

విలక్షణ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ, నాగార్జున అక్కినేని కాంబినేష‌న్లో తెర కెక్కిన చిత్రం ఆఫీసర్‌. ఈ చిత్రం నుంచి తొలి పాటను కాసేపటి క్రితం దర్శకుడు వర్మ ట్విటర్‌లో రిలీజ్‌ చేశారు. తన కెరీర్‌లోనే తొలిసారిగా ఓ చిన్న పాపపై తాను పాటను రూపొందించానని వ‌ర్మ చెప్పారు. ‘నవ్వే నువ్వు నవ్వకపోతే..' అంటూ సాగే సాంగ్‌కు రమ్య బెహరా గాత్రం అందించారు. తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్‌ ఆధారంగా సాగే ఈ పాటను సిరాశ్రీ రచించారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన వర్మకు సిరాశ్రీ థాంక్స్‌ చెప్పగా, తనదైన స్టైల్‌లో వర్మ రిప్లై కూడా ఇచ్చాడు.   
బంగారి బాలరాజు పాటలు విడుదల చేసిన  నిర్మాత దిల్ రాజు, మంత్రి భూమా అఖిలప్రియ

బంగారి బాలరాజు పాటలు విడుదల చేసిన నిర్మాత దిల్ రాజు, మంత్రి భూమా అఖిలప్రియ

బంగారి బాలరాజు చిత్రం ఆడియోలోని మొదటి మూడు పాటలను నందమూరి కళ్యాణ్ రామ్, నిర్మాతలు అశ్వనీదత్, అనిల్ సుంకర విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం లోని మరోపాట 'నా కొంగులో నా గుండెలో....' అంటూ సాగే సాంగ్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారి చేతుల మీదుగా విడుదల చేశారు. కొత్తవారితో తెరకెక్కిన బంగారి బాలరాజు సినిమా మంచి విజయం సాధించి అందరికి మంచిపేరు తీసుకురావాలని మూవీ యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. టిడిపి నాయకులు బిజ్జం పార్ధసారధి రెడ్డి గారు మాట్లాడుతూ... బంగారి బాలరాజు సినిమా మంచి విజయం సాధించాలని హీరో, దర్శక నిర్మాతలకు విషెస్ అందించారు.

అత్యంత ధనిక పార్టీల్లో ఫస్ట్ సమాజ్ వాదీ, సెకండ్ టీడీపీ

అత్యంత ధనిక పార్టీల్లో ఫస్ట్ సమాజ్ వాదీ, సెకండ్ టీడీపీ

దేశంలోని అత్యంత సంపన్న ప్రాంతీయ పార్టీగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ)నిలిచింది. 32 ప్రాంతీయ పార్టీల్లో రూ 82.72 కోట్ల ఆదాయంతో సమాజ్‌వాదీ అత్యంత సంపన్న పార్టీగా నిలిచిందని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ నివేదిక వెల్లడించింది. ఎస్‌పీ తర్వాత రూ 72.92 కోట్లతో టీడీపీ రెండో అత్యంత సంపన్న ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఇక ఏఐఏడీఎంకే రూ 48.88 కోట్లతో తర్వాతి స్ధానంలో ఉంది. మొత్తం 32 ప్రాంతీయ పార్టీల ఆదాయం 2016-17లో రూ 321.03 కోట్లుగా నమోదైంది.