Short News

నితిన్ సినిమా విడుదల తేది ఖరారు... అప్పుడు హిట్ మరి ఇప్పుడు?

నితిన్ సినిమా విడుదల తేది ఖరారు... అప్పుడు హిట్ మరి ఇప్పుడు?

హీరో నితిన్, రాశీ ఖన్నా జంటగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా శ్రీనివాస కళ్యాణం. శతమానం భవతి సినిమాతో మంచి సక్సెస్ సాధించిన దర్శకుడు సతీష్ వేగ్నేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో రాశీఖ‌న్నా తో పాటు నందితా శ్వేతాలు మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలి ఎంటర్టైనర్ గా తెరకేక్కబోయే ఈ సినిమా ఆగష్టు 9న విడుదల చెయ్యడానికి చిత్ర నిర్మాత సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. లై, ఛల్‌ మోహన్‌ రంగ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవటంతో శ్రీనివాస కల్యాణం సినిమా సక్సెస్ పై ఆశలు పెట్టుకున్నాడు నితిన్.

రూ.40 లక్షల కోట్ల సంపదపై చైనా గురి

రూ.40 లక్షల కోట్ల సంపదపై చైనా గురి

అరుణాచల్‌ప్రదేశ్‌‌ సరిహద్దు వెంట చైనా పెద్ద ఎత్తున గనుల తవ్వకాలు మొదలు పెట్టింది. 40 లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలు ఉన్నట్లు ఆదివారం ఓ మీడియా నివేదిక వెల్లడించింది. చైనా ఆధ్వర్యంలోని టిబెట్‌లోని ల్హున్జె ప్రాంతంలో ఈ తవ్వకాలు జరుపుతున్నారు. ఇది భారత్ సరిహద్దు వెంటే ఉందని హాంకాంగ్‌కు చెందిన సౌత్‌ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. అయితే దక్షిణ టిబెట్‌ను తన దేశంలో భాగంగా చేసుకోనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును మొదలు పెట్టింద'ని వెల్లడించింది.
చెన్నై గెలుపు ..పంజాబ్ ఇంటికి

చెన్నై గెలుపు ..పంజాబ్ ఇంటికి

పంజాబ్‌ జట్టు అద్భుతాలేమీ చేయలేదు. ప్లేఆఫ్స్‌ చేరాలంటే భారీ తేడాతో గెలవాల్సిన ఆ జట్టు 5 వికెట్ల తేడాతో చెన్నై చేతిలో మట్టికరించింది. మొదట లుంగి ఎంగిడి (4/10) సంచలన బౌలింగ్‌ ప్రదర్శన చేయడంతో పంజాబ్‌ 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. అనంతరం సురేశ్‌ రైనా (61 నాటౌట్‌) మెరుపులు మెరిపించడంతో చెన్నై 5 బంతులుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు రాయుడు (1), డుప్లెసిస్‌ (14), బిల్లింగ్స్‌ (0) విఫలమవడంతో చెన్నై 27/3తో కష్టాల్లో పడింది.  హర్భజన్‌ (19), దీపక్‌ చాహర్‌ (39) చెలరేగి ఆడి జట్టుపై ఒత్తిడి తగ్గించారు.
స్మార్ట్ ఫోన్ల వ్య‌వ‌సం నుంచి కాపాడే చిట్కాలివే..

స్మార్ట్ ఫోన్ల వ్య‌వ‌సం నుంచి కాపాడే చిట్కాలివే..

స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లకు వశం కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఐదు చిట్కాలు అందిస్తున్నారు నిపుణులు. మొద‌టిది మొబైల్ డేటా ఆఫ్ చేయ‌డం. దీని ద్వారా మెసేజ్‌లు, నోటిఫికేషన్లతో పనికి అంతరాయం కలగకుండా ఉంటుందని చెబుతున్నారు. రెండోది రోజులో కొంత సమయం గ్యాడ్జెట్స్ ప‌క్క‌న పెట్టి ఆటలు, సంగీతం, సమాజ సేవ వంటి వాటికి స‌మ‌యం కేటాయించడం. మూడోది ఫోన్లో అన‌వ‌స‌ర క‌బుర్లు చెప్ప‌డం ఆపాలి. నాలుగు.. నిద్ర‌పోయే ముందు సెల్ ఫోన్ వాడొద్దు. చివ‌రిది.. కొన్నాళ్లు సాధార‌ణ మోడ‌ల్ ఫోన్ వాడండి.