నటి నివేదాకు లైంగిక వేధింపులు
ఎంటర్ టైన్మెంట్
- 4 days ago
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ చేస్తున్న ఆరోపణలు వివాదాస్పదమయ్యాయి. తాజాగా దీనిపై మెంటల్ మదిలో నటించిన నివేదా పేతురాజ్ స్పందించారు. చిన్నప్పుడు తనపై లైంగిక వేధింపులు జరిగాయని వెల్లడిస్తూ సోషల్మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘ప్రతి ఒక్కరూ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నవారే అయివుంటారని భావిస్తున్నానన్నారు. అందరు తల్లిదండ్రులు ఈ విషయం గురించి పిల్లలతో మాట్లాడటం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ తప్పదు. వారికి రెండేళ్ల వయసు నుంచే జాగ్రత్తలు చెప్పండని సూచించారు.