Short News

ఏన్టీఆర్ 35 వసంతంలోని ఐదో పేజ్‌ని చూశారా.?

ఏన్టీఆర్ 35 వసంతంలోని ఐదో పేజ్‌ని చూశారా.?

మే 20,1983న జ‌న్మించిన ఎన్టీఆర్ ఈ ఏడాదితో 35 వ‌సంతాలు పూర్తి చేసుకోనున్నాడు. ఆయన బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అభిమానులు ఎన్టీఆర్ చిత్రాల‌లోని పాత్ర‌ల‌కి సంబంధించి 35 పేజీలతో స్పెష‌ల్‌ పుస్తకాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో రోజుకో పేజీ చొప్పున 35 రోజుల పాటు పోస్ట‌ర్స్‌గా విడుద‌ల చేస్తున్నారు. తొలి పోస్ట‌ర్‌గా బాల‌రామాయ‌ణంలోని ఎన్టీఆర్ గెట‌ప్‌ని పోస్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. ఇక తార‌క‌రాముని అభిమాన సంద్రం అనే టైటిల్‌తో ఐదో పేజ్‌ని ఆదివారం విడుద‌ల చేశారు.
గవర్నర్‌పై చంద్రబాబు షాకింగ్: తెరపైకి 'పవన్ కళ్యాణ్'

గవర్నర్‌పై చంద్రబాబు షాకింగ్: తెరపైకి 'పవన్ కళ్యాణ్'

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌పై టీడీపీ నేతలు మంగళవారం నిప్పులు చెరిగారు. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల్లో గవర్నర్ కీలక పాత్ర పోషిస్తున్నారని, టీడీపీకి వ్యతిరేకంగా వివిధ పార్టీలను ఏకం చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం వారు వ్యక్తం చేస్తున్నారు. అసలు గవర్నర్ వ్యవస్థ ఎందుకని కూడా టీడీపీ నేతలు ప్రశ్నించారు. గవర్నర్ నరసింహన్ మొదటి నుంచి టీడీపీకి వ్యతిరేకమని ఆరోపించారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గవర్నర్ అంశాన్ని ప్రస్తావించారు.

రూ.2,253 కోట్ల హవాల రాకెట్ గుట్టురట్టు

రూ.2,253 కోట్ల హవాల రాకెట్ గుట్టురట్టు

ముంబైలో హవాలా రాకెట్ గుట్టురట్టయింది. మహ్మద్‌ ఫరూక్‌ అలియాస్‌ ఫరూక్‌ షేక్‌ అనే వ్యక్తి దాదాపు రూ.2,253 కోట్ల మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. మనీ లాండరింగ్‌ నివారణ చట్టం కింద ఫరూక్‌ను అధికారులు అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. నకిలీ దిగుమతి డాక్యుమెంట్ల ద్వారా కోట్ల రూపాయలను విదేశాలకు తరలించడానికి ఫరూక్‌ 13 కంపెనీలను వాడినట్టు ఆరోపణలు ఉన్నాయి. అతన్ని ఏప్రిల్‌ 26 వరకు ఈడీ తన కస్టడీలోకి తీసుకుంది.
మహానటి సినిమా లేటెస్ట్ న్యూస్, చిత్ర యూనిట్ అంతా ఒక్క చోటికి!

మహానటి సినిమా లేటెస్ట్ న్యూస్, చిత్ర యూనిట్ అంతా ఒక్క చోటికి!

మహానటి సినిమాలో నటించిన నటీనటుల పాత్రలు త్వరలో పోస్టర్స్ ద్వారా విడుదల చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. మే ఒకటిన ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ గా చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ''తరాలను నిర్మించే స్త్రీ జాతి కోసం.. తరతరాలు గర్వించే కథ మహానటి సావిత్రి కథ''. తన అంద చందాలతోనే కాదు, గుణగణాలతోను ఇప్పటికీ తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటి మహానటి సావిత్రి. ఈ మహానటి రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోను ఎందరికో స్పూర్తిదాయకంగా నిలిచింది.