Short News

సంగీత దర్శకురాలిగా పి.సుశీల.?

సంగీత దర్శకురాలిగా పి.సుశీల.?

గానకోకిల పీ.సుశీల సంగీత దర్శకురాలిగా మారబోతున్నారా అంటే అవునని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హింది, సంస్కృతం, తుళు ఇలా 11 భాషల్లో 50వేలకు పైగా పాటలు పాడి గిన్నీస్‌ రికార్డును సాధించారు. అయితే నీట్‌ పరీక్షలకు వ్యతిరేకంగా పోరాడి ఆత్యహత్య చేసుకున్న వైద్య విద్యార్ధిని అనిత జీవిత వృత్తాంతం సినిమాగా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ప్రఖ్యాత గాయనీ పీ సుశీలను సంగీతం అందించనున్నారని సోషల్‌ మీడియాలో ప్రచారం వైరల్‌ అవుతోంది.
కాస్టింగ్‌ కౌచ్‌పై డాక్యుమెంటరీ 'బాలీవుడ్‌ డార్క్‌ సీక్రెట్‌'

కాస్టింగ్‌ కౌచ్‌పై డాక్యుమెంటరీ 'బాలీవుడ్‌ డార్క్‌ సీక్రెట్‌'

సినీపరిశ్రమ ఏదైనా కాస్టింగ్‌ కౌచ్‌ అంశం వివాదాస్పదమే. ఈ కాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారంపై బీబీసీ డాక్యుమెంటరీని ప్రసారం చేయబోతోంది. దీనిలో రాధికా ఆప్టే, ఉషా జాధవ్‌తో సహా పలువురు వర్థమాన నటీనటులు తమ అనుభవాలను వెల్లడించారు. 'బాలీవుడ్‌ డార్క్‌ సీక్రెట్‌' పేరిట ఈ డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేయనుంది. ఈ డాక్యుమెంటరీని రజనీ వైద్యనాథన్‌ రూపొందించారు. ఈ డాక్యుమెంటరీ ఏప్రిల్ 28, 29 తేదీల్లో ప్రసారం కానుంది. రాధికా ఆప్టే మాట్లాడుతూ 'మహిళలు, పురుషులు కలిసికట్టుగా ముందుకొస్తే ఇది ఆగిపోతోంది' అని పేర్కొన్నారు.  
టీటీడీ బోర్డు నుంచి ఎమ్మెల్యే అనిత తొలగింపు

టీటీడీ బోర్డు నుంచి ఎమ్మెల్యే అనిత తొలగింపు

టీటీడీ బోర్డు సభ్యురాలిగా ఎమ్మెల్యే అనితను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ బోర్డులో అనితను నియమించడంపై పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. తాను క్రిస్టియన్ అంటూ అనిత చెప్పిన వీడియోను ప్రభుత్వం పరిశీలించింది. దీంతో ఎమ్మెల్యే అనిత వ్యవహారంపై సీఎం చంద్రబాబు అధికారులను నివేదిక కోసం ఆదేశించారు. వారిచ్చిన నివేదిక ఆధారంగా అనితపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కాగా టీటీడీ బోర్డులో మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. మ‌రోవైపు టీటీడీ సభ్యురాలిగా తనను తప్పించాలని అనిత‌నే సీఎం చంద్రబాబుకు ఇటీవ‌ల లేఖ రాశారు.   
ఛాంపియన్స్‌ ట్రోఫీ స్థానంలో 'వరల్డ్‌ టీ20'

ఛాంపియన్స్‌ ట్రోఫీ స్థానంలో 'వరల్డ్‌ టీ20'

ఐసీసీ నిర్వహించే ఛాంపియన్స్‌ ట్రోఫీ ఇక నుంచి కనిపించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీని స్థానంలో వరల్డ్‌ టీ20 టోర్నీ జరపాలన్న ఐసీసీ నిర్ణయానికి తాజాగా తొలి అడుగుపడింది. షెడ్యూల్‌ ప్రకారం 2021లో భారత్‌లో చాంపియన్స్‌ ట్రోఫీ జరగాల్సి ఉండగా దాని స్థానంలో టీ20 వరల్డ్‌ కప్‌ను నిర్వహించడానికి ఐసీసీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ ప్రతిపాదనకు ఐసీసీ గ్లోబల్‌ బాడీ ఏకగీవ్ర ఆమోదం తెలిపినట్లు ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవ్‌ రిచర్డ్‌సన్‌ తెలిపారు. వరల్డ్‌ టీ20 ద్వారా 16 జట్లను ఆడించేందుకు నిర్ణయం తీసుకుంది.