Short News

రష్యా మోడల్ చేతిలో శానిటరీ ప్యాడ్ ..ఎందుకంటే..

రష్యా మోడల్ చేతిలో శానిటరీ ప్యాడ్ ..ఎందుకంటే..

బాలీవుడ్ చిత్రం 'ప్యాడ్‌మ్యాన్' రష్యాలోనూ విడుదలైంది. అక్కడ ఈ సినిమాకు ఆదరణ లభించటంతో అక్కడ సెలబ్రిటీలు 'ప్యాడ్ మ్యాన్' ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నారు. ఈ నేపధ్యంలో రష్యా సూపర్ మోడల్ నటాలియా వోడియనోవా ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్‌లో చేతిలో శానిటరీ ప్యాడ్ పట్టుకున్న ఫొటోను షేర్ చేసింది. 'అవును నా చేతిలో ప్యాడ్ ఉంది. దీని గురించి నేనేమీ సిగ్గు పడటం లేదు. ఇది చాలా సహజం' అని కామెంట్ పెట్టింది.
నా  జన్మదినం రోజు శ్రీదేవిని చివరి సారి చూశా

నా జన్మదినం రోజు శ్రీదేవిని చివరి సారి చూశా

శ్రీదేవి హాఠాన్మరం పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీదేవి మరణవార్త విని తాను షాక్‌ గురయ్యానని తెలిపారు. శ్రీదేవి అకాల మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ఆమె విషయంలో భగవంతుడు చాలా అన్యాయం చేశాడని అన్నారు. ‘జగదేక వీరుడు-అతిలోక సుందరి'లో ఇంద్రజ పాత్ర తన కోసమే పుట్టిందా? అన్నట్లు నటించి మెప్పించిందన్నారు. చిరు తన 60వ జన్మదినం రోజున.. ఆమెను ప్రత్యక్షంగా చూడటం అదే ఆఖరిసార అని గుర్తు చేశారు.
షేమ్: శ్రీదేవి మృతిపై కాంగ్రెస్ దారుణంగా, నెటిజన్ల ఆగ్రహం

షేమ్: శ్రీదేవి మృతిపై కాంగ్రెస్ దారుణంగా, నెటిజన్ల ఆగ్రహం

బాలీవుడ్ నటి శ్రీదేవి మృతిపై పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె హఠాన్మరణంపై కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్‌లో ప్రగాఢ సానుభూతి తెలిపింది. అయితే, కాంగ్రెస్ పార్టీ చేసిన పూర్తి ట్వీట్ చదివిన తర్వాత నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడటంతో ఆ ట్వీట్‌ను కాంగ్రెస్ పార్టీ తొలగించింది. శ్రీదేవి మృతికి సంతాపం తెలపడం ఓకే.. కానీ తామే అవార్డు ఇచ్చామని ప్రకటించడం నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది.

విషాదం: పేలిన పెళ్లి కానుక: నవ వరుడు మృతి, వధువుకు తీవ్ర గాయ

విషాదం: పేలిన పెళ్లి కానుక: నవ వరుడు మృతి, వధువుకు తీవ్ర గాయ

కొత్తగా వివాహం చేసుకున్న ఆ జంటను పెళ్లి కానుకే వేరు చేసింది. పెళ్లికి వచ్చిన కానుకను తెరిచి చూస్తుండగా.. అందులో పెట్టిన బాంబు పేలింది. ఈ ఘటనలో వరుడు సౌమ్యశేఖర్, అతని నాన్నమ్మ జెమామణి మృతి చెందారు. వధువు రీమా సాహుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని బొలంగీర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రాయ్‌పూర్ నుంచి పార్సిల్ వచ్చినట్లు గుర్తించారు. ఎవరు? ఎందుకు? ఇలా చేశారనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.