Short News

ఏప్రిల్ 28 నుంచి 'అలెక్స్ పారిష్'  వస్తోంది

ఏప్రిల్ 28 నుంచి 'అలెక్స్ పారిష్' వస్తోంది

అంతర్జాతీయ నటిగా మారిన ప్రియాంక చోప్రా త్వరలో ప్రేక్షకులను పలకరించనుంది. ఆమె నటిస్తున్న అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికో మూడో సీజన్‌ సిద్ధమైంది. ప్రియాంక ఎఫ్‌బీఐ ఏజెంట్ అలెక్స్ పారిష్ పాత్రలో నటించిన 'క్వాంటికో' మూడో సీజన్ ఏప్రిల్ 28 నుంచి ప్రసారం కానుంది. ఇండియాలో స్టార్ వరల్డ్, స్టార్ వరల్డ్ హెచ్‌డీ ఛానళ్ళలో ప్రతీ శనివారం రాత్రి 9గంటలకు 'క్వాంటికో' ప్రసారం కానుంది.
సంచలనం: హైదరాబాద్ సెలబ్రిటీని లేపేందుకు దావూద్ సుపారీ?, ఎవరత

సంచలనం: హైదరాబాద్ సెలబ్రిటీని లేపేందుకు దావూద్ సుపారీ?, ఎవరత

భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌లో ఒకరైన అండర్ వరల్డ్ డాన్ దావూద్‌ ఇబ్రహీం ఓ హైదరాబాద్ సెలబ్రిటీని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ఆ సెలబ్రిటీని హత్య చేసేందుకు దావూద్ నమ్మిన బంటు చోటా షకీల్‌‌తో రూ.45 లక్షల ఒప్పందం కుదిరిందని పోలీసుల అదుపులో ఉన్న నసీం వెల్లడించాడు. అయితే ఆ సెలబ్రిటీ ఎవరన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. బహుశా సినీ రంగానికి చెందిన వ్యక్తే అయి ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఓ సెలబ్రిటీని చంపేంత అవసరం దావూద్ కు ఏమొచ్చిందనేది అంతుచిక్కని ప్రశ్న.

హైదరాబాదులో సెలబ్రిటీని చంపాలకున్న దావూద్

హైదరాబాదులో సెలబ్రిటీని చంపాలకున్న దావూద్

దావూద్‌ ఇబ్రహీం హైదరాబాదులో ఓ సెలబ్రిటీని చంపేందుకు షూటర్ ని రంగంలోకి దించడం కలకలం రేపుతోంది. గత నవంబర్లో ఢిల్లీ నార్త్ ఈస్ట్ పోలీసులు షార్ప్‌ షూటర్‌ నసీం అలియాస్‌ రిజ్వాన్‌ ను అరెస్టు చేయగా, ఢిల్లీ స్పెషల్ పోలీసులు అతనిని విచారిస్తున్నారు. ఈ విచారణలో హైదరాబాదులో ఒక సెలబ్రిటీని డీ-గ్యాంగ్ టార్గెట్ చేసిందన్న విషయాన్ని నసీం బయటపెట్టాడు. హైదరాబాదులో ఆ సెలబ్రిటీని చంపేందుకు చోటా షకీల్‌ తో 45 లక్షలకి ఒప్పందం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. 
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం:40 మందికి గాయాలు

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం:40 మందికి గాయాలు

విశాఖపట్టణం:విశాఖ నగర శివార్లలో ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎన్ఏడీ జంక్షన్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్నలారీని ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టి బోల్తా పడింది. తెల్లవారుఝామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి విజయనగరం జిల్లా రాజాంకు వెళుతున్న శ్రీ వెంకట రమణ ట్రావెల్స్ బస్సు ఎన్ ఎడి జంక్షన్ మీదుగా ప్రమాణిస్తున్న సమయంలో, మర్రిపాలెం వైపు వెళ్తున్న లారీ ఎదురుగా వచ్చింది. దీంతో లారీని ఢీ కొట్టకుండా ఉండేందుకు బస్సు ఢ్రైవర్ సడెన్ బ్రేక్ వేయగా, బస్సు అప్పటికే లారీని ఢీ కొట్టి తిరగబడింది.