Short News

మళ్లీ తెరపైకి ప్రభాస్, అనుష్క పెళ్లివార్త.. ఇదిగో బలమైన ఆధారం!

మళ్లీ తెరపైకి ప్రభాస్, అనుష్క పెళ్లివార్త.. ఇదిగో బలమైన ఆధారం!

బాహుబలి ది కన్‌క్లూజన్ రిలీజ్ తర్వాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, అనుష్కశెట్టి పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు సంచలనంగా మారాయి. అయితే తమ మధ్య అలాంటి బంధం లేదని, మా మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్ మాత్రమే అని వారు చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత సాహో నుంచి అనుష్కను తప్పించి.. ప్రభాస్ పక్కన శ్రద్ధాకపూర్‌ను హీరోయిన్‌గా పెట్టారు. దాంతో వారిద్దరి పెళ్లి వార్తలు మరింత జోరు పెంచాయి. అయితే ప్రభాస్, అనుష్క బంధం అలానే కొనసాగుతున్నదనే తాజాగా బయటకు వచ్చింది.

మహేష్ @ 25 ..మీసకట్టు .. సీమ స్లాంగ్ ..

మహేష్ @ 25 ..మీసకట్టు .. సీమ స్లాంగ్ ..

ఇటీవలి కాలంలో టాలీవుడ్ హీరోలు గెట‌ప్‌లోనే కాదు భాష‌లో వైవిధ్యం చూపించేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా మ‌హేష్ బాబు త‌న త‌దుప‌రి చిత్రం కోసం రాయలసీమ భాష‌లో మాట్లాడుతాడ‌ట‌. వంశీపైడిప‌ల్లి దర్శకత్వంలో చేయనున్న ఈ చిత్ర కధ రాయ‌ల‌సీమ‌తోనే ముడిప‌డి ఉంటుంద‌ట. ముఖ్య‌మైన స‌న్నివేశాలు క‌ర్నూలులో ఉంటాయ‌ట‌. అంతేకాదు ఈ సినిమాలో మ‌హేష్ మీస‌క‌ట్టుతో క‌నిపిస్తాడ‌ని అంటున్నారు. ఈ చిత్రంలో  పూజా హెగ్డే క‌థానాయిక‌. ఈ చిత్రాన్ని దిల్‌రాజు, అశ్వనీదత్‌ కలిసి నిర్మించ‌నున్నారు.  
తొలిసారి పోలీస్ పాత్రలో ప్రభుదేవా

తొలిసారి పోలీస్ పాత్రలో ప్రభుదేవా

నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్ర‌భుదేవా కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు పోలీస్ పాత్ర‌లు చేయ‌లేదు. తొలిసారి యాక్ష‌న్ ఫ్లిక్‌లో పోలీస్ పాత్ర చేయ‌బోతున్నాడు. టిక్ టిక్ టిక్ నిర్మాత నెమిచంద్ జ‌బ‌క్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏసీ ముగ్లీ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. ప్రభుదేవా తొలిసారి పోలీస్ పాత్ర చేయ‌నున్నాడని చిత్ర నిర్మాత ట్విట్టర్ ద్వారా తెలిపారు. మ‌రి ఖాకీ దుస్తుల్లో ప్ర‌భుదేవా ప్రేక్ష‌కుల‌ని ఏ రేంజ్‌లో మెప్పిస్తాడో చూడాలి.
టీ20 లీగ్ లో శ్రేయస్‌ గోపాల్‌ అరుదైన ఘనత

టీ20 లీగ్ లో శ్రేయస్‌ గోపాల్‌ అరుదైన ఘనత

రాజస్థాన్‌ స్పిన్నర్‌ శ్రేయస్‌ గోపాల్‌ అరుదైన ఘనత సాధించాడు. టీ20 లీగ్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన ఆటగాళ్ళ జాబితాలో గోపాల్‌ ఐదో స్థానంలో నిలిచాడు. శనివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గోపాల్‌ 16 పరుగులిచ్చి 4 వికెట్లు తీసాడు. ఈ జాబితాలో అంకిత్‌ రాజ్‌పుత్ ‌(5/14) తొలి స్థానంలో ఉండగా, అజిత్‌ చండీల్లా(4/13) రెండో స్థానంలో, అరవింద్‌(4/14) మూడో స్థానంలో, భాటియా(4/15) నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానాన్ని శ్రేయస్‌ గోపాల్‌ ఆక‍్రమించాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది.