Short News

ఈసారి 'ముద్దు'తో గుండెల్ని కాల్చేసింది
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/pC2yUlN2kMU" frameborder="0" allow="autoplay; encrypted-media" allowfullscreen></iframe>

ఈసారి 'ముద్దు'తో గుండెల్ని కాల్చేసింది

కొంటె చూపులతో కన్ను మీటు కుర్రకారు గుండెల్ని గిలిగింతలు పెట్టిన మలయాళీ భామ ప్రియా ప్రకాష్ వారియర్ మరోసారి వచ్చేసింది. ఈసారి ఏకంగా ముద్దుతో గుండెల్ని పేల్చేసింది. ప్రియా నటించిన 'ఒరు అదార్ లవ్' వాలంటైన్స్ డే టీజర్ విడుదలైంది. టీజర్లో ప్రియా అవే చూపులను చూస్తూ రెండు వేళ్ళకు ముద్దు పెట్టి తుపాకీ చేసి ప్రియుడి గుండెల్ని కాల్చేసింది. ఇప్పటికే కన్ను కొట్టి మనసుల్ని మీటిన ఈ చిన్నది ఈ ముద్దు తూటాతో ఇంకెన్నిగుండెల్ని కాల్చేస్తుందో చూడాలి.
త్వ‌ర‌లో అమితాబ్‌తో  సురేందర్‌రెడ్డి డైరెక్షన్

త్వ‌ర‌లో అమితాబ్‌తో సురేందర్‌రెడ్డి డైరెక్షన్

త్వ‌ర‌లో బాలీవుడ్ టాప్ స్టార్ అమితాబచ్చన్ ను టాలీవుడ్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి డైరెక్ష‌న్ చేయ‌బోతున్నాడు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి క‌థానాయకుడిగా న‌టిస్తున్న ‘సైరా' సినిమా తెర‌కెక్కిస్తున్నారు. అయితే ఇందులో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కన్పించనున్నాడు. ఈ ప్రాజెక్టు డిష్కషన్స్‌లో భాగంగా డైరెక్టర్ సురేందర్‌రెడ్డి అమితాబ్‌ను కలిశాడు. సురేంద‌ర్ రెడ్డి బిగ్‌బీతో కలిసి దిగిన ఫొటో ఇపుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది.
నోకియ్ 7ప్లస్ ఫొటోలు లీక్..!

నోకియ్ 7ప్లస్ ఫొటోలు లీక్..!

హెచ్‌ఎండీ గ్లోబల్ నోకియా కంపెనీ నోకియా జోష్ మీదుంది. స్మార్ట్ ఫోన్ల‌ను విడుద‌ల చేయ‌డంలో జ‌ట్ స్పీడ్ మీద ఉంది. త్వరలో మరో కొత్త మోడల్‌ను విడుదల చేయబోతోంది. కొత్త ఫోన్ కు కొన్ని ఫోటోలు సైతం సోషల్‌ మీడియాలో లీకయ్యినట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో దీన్ని ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది.6అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ రిజల్యూషన్‌, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ మెమోరీ ఉంటుంది. హెచ్‌ఎండీ గ్లోబల్‌ నుంచి ఆండ్రాయిడ్‌ ఒన్‌తో వస్తున్న తొలి మొబైల్‌ కూడా ఇదే కావ‌డం విశేషం.
సూపర్  ఫీచర్స్ తో సెల్ కాన్ నుంచి యూనిక్ ఫోన్

సూపర్ ఫీచర్స్ తో సెల్ కాన్ నుంచి యూనిక్ ఫోన్

స్మార్ ఫోన్స్‌, ఫీచ‌ర్డ్ ఫోన్ల‌తో మొబైల్ త‌యారీ రంగంలో సెల్ కాన్ కంపెనీ త‌నదైన హావా కొన‌సాగిస్తూ వ‌స్తుంది. వినియోగ‌దారుల అభిరుచుల‌కు త‌గ్గ‌ట్టుగా ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ చేస్తూ క‌ష్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటుంది. సెల్ కాన్ కంపెనీ నుంచి నూతన స్మార్ట్‌ఫోన్ 'యూనిక్‌'ను తాజాగా విడుదలయింది. రూ.8,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో వెనుక భాగంలో 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా ఉండగా, ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఇక రెండు కెమెరాలకు కూడా ఫ్లాష్ సదుపాయం క‌ల్పించారు.