Short News

డేటింగ్ అంటూ ప్రపోజ్ చేస్తున్నారు

డేటింగ్ అంటూ ప్రపోజ్ చేస్తున్నారు

ఒక్క చూపుతో స్టార్ అయిపోయిన మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ తొలిసారి ఓ ఆంగ్ల మీడియా ద్వారా స్పందించింది. ఆ వీడియో వల్ల నా జీవితమే మారిపోయిందని అభిమానుల ఆదరణను ఎలా తట్టుకోవాలో అర్థంకావడం లేదని చెప్పింది. నా కనుబొమ్మలతోనే హావభావాలు పలికించాలని దర్శకుడు చెప్పినట్లే చేసినట్లు చెప్పింది. వాలెంటైన్స్‌ డే రోజున డేట్‌కి వస్తావా అని కొందరు అడిగారని తెలిపింది. చాలా మంది ప్రపోజ్‌ చేసారని చెప్పిన ఈ భామ తానింకా ఎవ్వర్నీ ప్రేమించలేదని చెప్పింది.
టీ20 సిరీస్ కి దూరమైన డివిలియర్స్

టీ20 సిరీస్ కి దూరమైన డివిలియర్స్

దక్షిణాఫ్రికా ఏబీ డివిలియర్స్‌ భారత్‌తో జరుగుతున్న ట్వంటీ 20 సిరీస్‌ నుంచి పూర్తిగా వైదొలిగాడు. మోకాలి గాయం కారణంగా తప్పుకున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు ప్రకటించింది.తొలి మూడు వన్డేలకు దూరమైన డివిలియర్స్‌ తదుపరి మూడు వన్డేల్లో ఆడినా ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఆదివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌ ఆరంభానికి కొద్ది నిమిషాల ముందు ఏబీ అర్థాంతరంగా తప్పుకున్నాడు. 
బూట్లు, సాక్సులు నిషేధించిన బీహార్ పరీక్షల బోర్డు

బూట్లు, సాక్సులు నిషేధించిన బీహార్ పరీక్షల బోర్డు

బిహార్‌లో బోర్డు పరీక్షలు అంటేనే చర్చనీయమైన అంశంగా మారుతోంది. తాజాగా ఆ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో అక్కడి అధికార యంత్రాంగం నూతన నిబంధనలు తీసుకువచ్చింది. పరీక్షలకు బూట్లు, సాక్సులు వేసుకురావొద్దని ఆదేశాలు జారీ చేసింది. సాధారణ స్లిప్పర్స్‌ లేదా ఫ్లిప్‌ఫ్లాప్స్‌ వేసుకురావాలని సూచించింది. ఫిబ్రవరి 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
అక్రమ సంబంధం: మహిళను చంపి తల, మొండెం వేరు చేశారు

అక్రమ సంబంధం: మహిళను చంపి తల, మొండెం వేరు చేశారు

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో ఓ మహిళ హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. జిల్లాలోని గూడూరు మండలం టేకులతండాలో ఈ సంఘటన శనివారంనాడు చోటు చేసుకుంది.

అక్రమ సంబంధమే ఆ మహిళ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్ారు. వినోద అనే ఆ మహిళను చంపిన వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది.

ఆమె మొక్కజొన్న చేను సమీపంలో ఉన్న పత్తి చేనులో వినోద రక్తం మడుగులో కనిపించింది. తల, మొండెం వేర్వేరుగా పడేశారు.