Short News

'ప్రియా' కన్ను గీటుకి సన్నీ ఔట్

'ప్రియా' కన్ను గీటుకి సన్నీ ఔట్

సోగకళ్ళ సైగలతో కుర్రకారును ఫిదా చేసిన మళయాళ నటి ప్రియా ప్రకాష్‌ వారియర్‌ సంచలనం కొనసాగుతోంది. గూగుల్‌ సెర్చ్‌లో ఇప్పటివరకూ టాప్ లో ఉన్న బాలీవుడ్‌ బ్యూటీ సన్నీలియోన్‌ను ప్రియా ప్రకాష్‌ దాటేసింది. కన్నుగీటుతూ ఆమె చేసిన హావభావాలు, కొంటె చూపులతో రాత్రికి రాత్రే ఇంటర్‌నెట్‌ సంచలనంగా మారింది. ప్రియా ధాటికి కత్రినా కైఫ్‌, అనుష్క శర్మ, దీపికా పదుకొనేలు కూడా గూగుల్‌ సెర్చ్‌లో వెనుకపడ్డారు.
బురిడీ బాబా.. కిలాడి లేడీ, వెలుగులోకి ఆసక్తికర విషయాలు!

బురిడీ బాబా.. కిలాడి లేడీ, వెలుగులోకి ఆసక్తికర విషయాలు!

నెల్లూరు సుధాకర్‌ మహరాజ్‌ అనే బురిడీ బాబా దోపిడీ కేసులో కీలక పత్రాలతోపాటు, నగదు మాయం చేసినట్లు అనుమానిస్తున్న కిలాడీ లేడీ గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఆమె పూర్తిపేరు మెతుకు వెంకట నాగవాసవి అని.. ఆమెది ఒంగోలు అని తేలింది. సుధాకర్‌ మహరాజ్‌ ఇష్టకామ్యయాగం పేరుతో ఆశ్రమానికి వచ్చే ప్రముఖులు, రాజకీయ నాయకుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేయడంలో నాగవాసవి కీలక పాత్ర పోషించిందని, ఈ డబ్బును ఆమె సొంత ఖాతాలకు మళ్లించిందని, ప్రముఖులంతా వాసవి సూచనలకు అనుగుణంగా ఆశ్రమానికి వచ్చి వెళ్లేవారని తెలిసింది.

షాకింగ్: నటి ఎదుటే కారులో హస్తప్రయోగం చేసిన డ్రైవర్!

షాకింగ్: నటి ఎదుటే కారులో హస్తప్రయోగం చేసిన డ్రైవర్!

బాలీవుడ్ ప్రముఖ నటుడు సుమిత్ రాఘవన్ భార్య చిన్మయి ఓ గుర్తు తెలియని కారు డ్రైవర్‌పై ముంబైలోని విలెపార్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంటి వద్ద వైట్ కలర్ బీఎండబ్ల్యూ కారులో కూర్చున్న ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని, తనను చూస్తూ హస్తప్రయోగం చేసుకున్నాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

గుజరాత్ మున్సిపోల్స్: బీజేపీ అధికస్థానాల్లో గెలిచినా...

గుజరాత్ మున్సిపోల్స్: బీజేపీ అధికస్థానాల్లో గెలిచినా...

గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు.. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనే తలపిస్తున్నాయి. బీజేపీ కొన్ని స్థానాలను కోల్పోగా, కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 75 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగ్గా అధికార బీజేపీకి 47, కాంగ్రెస్‌కు 16, స్వతంత్రులు 4, ఎన్సీపీ, బీఎస్పీలు చెరొకటి గెలుచుకున్నాయి. 75 మున్సిపాల్టీలు, రెండు జిల్లా పరిషత్‌లు, 17 తాలూకాలు, 1400 గ్రామపంచాయితీలకు ఫిబ్రవరి 17న పోలింగ్ నిర్వహించారు.