Short News

అలా చేసి ఉంటే  నా హెయిర్ స్టైల్ అందంగా ఉండేది

అలా చేసి ఉంటే నా హెయిర్ స్టైల్ అందంగా ఉండేది

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు జుట్టు లేకపోయినప్పటికీ ఎలాంటి విగ్గులు పెట్టుకోకుండా నేచురల్‌గా ఉండటానికే ఇష్టపడతారు. అయితే ఇటీవల తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నేత ఏసీ షణ్ముగన్‌ను డాక్టరేట్‌తో‌ సత్కరించేందుకు చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రజనీకాంత్ పాల్గొన్నారు. షణ్ముగన్‌ నాకు దాదాపు 1980 నుంచి తెలుసు. ఈ వయసులోనూ ఆయన హెయిర్‌స్టైల్‌ కూడా బాగుంటుంది. ఆయన తన హెయిర్‌స్టైల్‌కు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో తెలిసుంటే నేను కూడా కేర్‌ తీసుకునేవాడిని' అని చమత్కరించారు రజనీ. ఆయన ప్రసంగం విని అక్కడున్న వారంతా పగలబడి నవ్వుకున్నారు.
బాక్సాఫీస్: ఆ చిత్రాన్ని బీట్ చేసిన ధడక్.. తొలి రోజు బంపర్ వసూళ్లు, జాన్వీ క్రేజ్!

బాక్సాఫీస్: ఆ చిత్రాన్ని బీట్ చేసిన ధడక్.. తొలి రోజు బంపర్ వసూళ్లు, జాన్వీ క్రేజ్!

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ డెబ్యూ మూవీ ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. ధడక్ చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. తొలి షో నుంచే ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. జాన్వీ అద్భుతంగా నటించిందనే ప్రశంసలు దక్కుతున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ధడక్ చిత్రం సంచలనాలు మొదలుపెట్టింది. స్టార్ వారసురాలిగా జాన్వీ డెబ్యూ మూవీ కావడం, షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ హీరోగా నటించడంతో ధడక్ చిత్రానికి భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రం కోసం యువత మొత్తం ఎదురుచూశారు.

సోదరి ఇంటి వరకు డ్రాప్ ఇస్తానని యువతి మీద అత్యాచారం!

సోదరి ఇంటి వరకు డ్రాప్ ఇస్తానని యువతి మీద అత్యాచారం!

బెంగళూరు గ్రామీణ జిల్లా దోడ్డబళ్లాపురం సమీపంలోని గ్రామంలో నివాసం ఉంటున్న యువతి (25) అనారోగ్యంతో బాధపడుతోంది. దోడ్డబళ్లాపురం చేరుకున్న యువతి ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంది. ఎంత సేపటికి బస్సు రాకపోవడంతో సమీపంలోని అరుళుమల్లిగే గ్రామంలో నివాసం ఉంటున్న అక్క ఇంటికి వెళ్లాలని యువతి నిర్ణయించింది. ఆ సమయంలో అరళుమల్లిగే పక్క గ్రామంలో నివాసం ఉంటున్న చెన్నకేశవ అనే వ్యక్తి స్కూటర్ లో అక్కడికి వెళ్లాడు. అక్క ఇంటి వరకు డ్రాప్ ఇస్తానని నమ్మించి స్కూటర్ లో పిలుచుకుని వెళ్లాడు.

గ్రాడ్యుయేట్లకు 'పేటీఎం మాల్'లో 5000 ఉద్యోగాలు

గ్రాడ్యుయేట్లకు 'పేటీఎం మాల్'లో 5000 ఉద్యోగాలు

పేటీఎం సంస్థకు చెందిన పేటీఎం మాల్‌ గ్రాడ్యుయేట్ల కోసం అతిపెద్ద రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ను నిర్వహించనుంది. 'క్యాంపస్‌ ఐకాన్‌ ప్రొగ్రామ్‌'లో​భాగంగా దాదాపు 5000 మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకోనున్నట్టు తెలిపింది. విద్యార్థులకు టెక్నాలజీ, మార్కెటింగ్‌, సేల్స్‌ విభాగాల్లో వారి సామర్థ్యాలను మెరుగుపరచనున్నారు. వీటిలో టాప్‌ పర్‌ఫార్మర్స్‌కు అక్టోబర్‌ 10న లక్ష రూపాయల వరకు నగదు బహుమతితో పాటు, పేటీఎం మాల్‌లో ఫుల్‌-టైమ్‌ ఉద్యోగాన్ని కూడా ఆఫర్‌ చేస్తోంది. ఈ ప్రోగ్రామ్‌ ద్వారా 2017లో 2,200 మంది విద్యార్థులను నియమించుకుంది.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more