Short News

రజనీకాంత్‌తో సల్మాన్ నువ్వా? నేనా?.. బాక్సాఫీస్‌కు ఇత్తడే..

రజనీకాంత్‌తో సల్మాన్ నువ్వా? నేనా?.. బాక్సాఫీస్‌కు ఇత్తడే..

భారతీయ సినిమా పరిశ్రమలో సూపర్‌స్టార్ల సినిమాలు ఒకే తేదీన రిలీజ్ కావడం సాధారణమే. అప్పుడు రెండు భారీ సినిమాలు తలపడటం ఆసక్తికరంగా మారుతుంది. త్వరలోనే ఇద్దరు భారతీయ సూపర్‌స్టార్ల సినిమాలు ఢీకొనేందుకు సిద్ధమవుతున్నది. అందులో ఒకటి రజనీకాంత్ నటించిన కాలా, మరోటి సల్మాన్ ఖాన్ నటించిన రేస్3 సినిమా కావడం విశేషం. దాంతో జాతీయ మీడియాలో ఈ రెండు చిత్రాల రిలీజ్ డేట్ ప్రాధాన్యతను సంతరించుకొన్నది.వాస్తవానికి కాలా చిత్రం ఏప్రిల్ 27న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ తమిళ చిత్ర పరిశ్రమలో సమ్మె కారణంగా కాలా చిత్రం వాయిదా పడింది.

మన్నించు.. ఇషాన్ ..బలంగా నిలబడు

మన్నించు.. ఇషాన్ ..బలంగా నిలబడు

మంగళవారం రాత్రి  బెంగళూరుతో మ్యాచ్‌లో ముంబయి వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ దెబ్బ తిన్నాడు. హార్దిక్‌ పాండ్య విసిరిన త్రో బలంగా అతడి కంటి పక్కన తాకింది. ఆ దెబ్బకు అతను బాధతో విలవిలలాడిపోయాడు. మైదానాన్ని కూడా విడిచి వెళ్ళిపోయాడు. తన వల్లే ఇషాన్‌ గాయపడటంతో హార్దిక్‌ కూడా చాలా బాధపడ్డాడు. మ్యాచ్‌ తర్వాతి రోజు ఇషాన్‌ను కలిసిన పాండ్య అతడితో ఫొటో దిగి ట్విటర్లో పంచుకున్నాడు. 'నా ప్రియమైన సోదరుడా.. మన్నించు. బలంగా నిలబడు' అని కామెంట్ చేసాడు.
''రాహు కాలం'' చూసుకుని మ‌రీ నామినేష‌న్ వేశారు.. ఎందుకంటే...

''రాహు కాలం'' చూసుకుని మ‌రీ నామినేష‌న్ వేశారు.. ఎందుకంటే...

రాజ‌కీయ నాయ‌కులు మంచి ముహూర్తం చూసుకొని ఎన్నికల్లో నామినేషన్ వేయడం మ‌న‌కు తెలిసిందే. కానీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బెళ‌గావి నుంచి కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేస్తున్న సతీష్ జార్కీహోలీ రాహు కాలంలో తన నామినేషన్ వేసి సంచలనం రేపారు. మూఢ నమ్మకాలను పారదోలాలనే తన ప్రచారోద్యమంలో భాగంగా తాను రాహుకాలం సమయంలో నామినేషన్ వేసినట్లు సతీష్ వెల్లడించారు. ‘‘నేను నా నియోజకవర్గంలో ఎన్నో మంచి పనులు చేశాను, ప్రజల మద్ధతు నాకే ఉంది. అందుకే రాహుకాలంలోనే నామినేషన్ వేశాను. అయినా విజయం నాదే '' అని సతీష్ ధీమాగా చెప్పారు.    
కళ్యాణ్ రామ్ సరసన ఆ ఇద్దరు హీరోయిన్స్. దర్శకుడు అతడే!

కళ్యాణ్ రామ్ సరసన ఆ ఇద్దరు హీరోయిన్స్. దర్శకుడు అతడే!

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఎంఎల్ఎ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో త్వరలో నా నువ్వు సినిమాను విడుదల చెయ్యబోతున్నాడు. జయేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గ నటిస్తోంది. తాజాగా కళ్యాణ్ రామ్ ఆర్య, అతడు, జల్సా, దూకుడు వంటి హిట్ చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేసిన గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేయనున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంభందించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.