Short News

ఆ హీరో కు  యాటిట్యూడ్ లేదు... అందరితోను చాలా ఓపెన్ గా...

ఆ హీరో కు యాటిట్యూడ్ లేదు... అందరితోను చాలా ఓపెన్ గా...

సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకేక్కబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నై లో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో సూర్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. డ్రీమ్ వారియర్స్ పతాకంపై ఎస్సార్ ప్రభు, ఎస్సార్ ప్రకాశ్ బాబులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావ‌ళికి సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొని రావాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో సూర్య గురించి హీరోయిన్ రకుల్ మాట్లాడడం జరిగింది.

రెండు నిమిషాల ప‌రుగుతో ఎముక‌లు దృఢం

రెండు నిమిషాల ప‌రుగుతో ఎముక‌లు దృఢం

వయస్సు మీద పడుతున్నకొద్దీ స్త్రీలలో ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుందన్న సంగతి తెలిసిందే! ఎముకలు పూర్వ ఆరోగ్యం సంతరించుకోవడానికి ప్రతి రోజూ రెండు నిమిషాలు పరుగు తీయడం లేదా జిమ్‌లో బరువులెత్తడం చేస్తే మంచి ఫలితం పొందవచ్చంటున్నారు నిపుణులు. సుమారు 2500 మంది స్త్రీల మీద వీరు సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు. వీరిలో కొందరి చేత ప్రతి రోజూ రెండు నిమిషాల పాటు పరుగు, జిమ్‌లో బరువులెత్తించడం చేశారు. మిగతావారిని మామూలుగా నడవమన్నారు. కొన్ని రోజుల తరువాత వీరి ఆరోగ్యాన్ని పరిశీలించగా పరుగుతీసిన స్త్రీలలో ఎముకల ఆరోగ్యం మునుపటికన్నా మెరుగు పడటం గుర్తించారు.     
ఢిల్లీ ఘన విజయం..టోర్నీనుంచి ముంబై ఔట్

ఢిల్లీ ఘన విజయం..టోర్నీనుంచి ముంబై ఔట్

టీ20లీగ్ 2018లో భాగంగా పుణే వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 11 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ గెలిచింది. సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ పోరాటం లీగ్‌ దశలోనే ముగిసింది. బ్యాట్స్ మెన్స్ పేలవ ప్రదర్శనతో సొంతగడ్డపై 163 పరుగులకే ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఫలితంగా మరోసారి ప్లేఆఫ్‌కు చేరాలన్న ముంబై ఇండియన్స్‌ లక్ష్యం నెరవేరలేదు. అంతకుముందు ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ జట్టు 174 పరుగులు చేసింది. రిషబ్ పంత్ ఆఫ్ సెంచరీ సాధించాడు.
పెట్రోల్‌ ధరలు పెంపుపై స్పందించిన కేంద్రమంత్రి

పెట్రోల్‌ ధరలు పెంపుపై స్పందించిన కేంద్రమంత్రి

పెట్రోల్‌ ధరలు అత్యంత గరిష్టస్థాయికి చేరుకోవడంపై కేంద్ర పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పందించారు. పెట్రో ఉత్పత్తులు తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం.. పెట్రోల్‌, డిజిల్‌ ధరలపై ప్రభావం చూపిందన్నారు. పెట్రోల్‌, డిజిల్‌ ధరలు పెరుగుదలతో సామన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని తాను అంగీకరిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే భారత ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుందని పేర్కొన్నారు.