Short News

బయోపిక్ సినిమాలపై రాంచరణ్ కామెంట్.. ఛాన్స్ వస్తే, ఉపాసన వలనే!

బయోపిక్ సినిమాలపై రాంచరణ్ కామెంట్.. ఛాన్స్ వస్తే, ఉపాసన వలనే!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఓ ఇంటర్వ్యూ లో బయోపిక్ చిత్రాల గురించి ప్రస్తావించాడు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్ నటించిన సంజు చిత్రంపై ప్రశంసలు కురిపించాడు. వివాదాస్పద నటుడు సంజయ్ దత్ జీవిత గాధగా సంజు చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. సంజు చిత్రంలో రణబీర్ కపూర్ అద్భుతంగా నటించాడని ప్రశంసించారు. నిజాలు తెలియజేసేందుకు బియోపిక్ సినిమాలు వస్తుంటాయి. అందువలన బయోపిక్ చిత్రాలంటే తనకు ఇష్టం ఏర్పడిందని చరణ్ తెలిపాడు.

అగ్నిపర్వతం చూడటానికి వెళ్ళి 23మంది గాయపడ్డారు

అగ్నిపర్వతం చూడటానికి వెళ్ళి 23మంది గాయపడ్డారు

హావాయి ద్వీపంలో పొగలు కక్కుతున్న అగ్నిపర్వతాన్ని దగ్గరగా చూడాలనే అత్యుత్సాహంతో 23 మంది పర్యాటకులు గాయాల పాలయ్యారు. సముద్రంలో నుంచి ఎగసిపడుతున్న అగ్నిపర్వతం అందాలను బోటు నుంచి 300 మీటర్ల దూరంలో వీక్షిస్తూ కేరింతలు కొడుతుండగా అగ్నిపర్వత శకలాలు బాంబుల్లా విరుచుకుపడ్డాయి. దీంతో పర్యాటకుల పడవకు చిల్లులు పడ్డాయి. ఈ ఘటనలో 23 మంది గాయపడ్డారు. సంచారం అందుకునున సహాయక సిబ్బంది హుటాహుటిన పర్యాటకులను తీరానికి చేర్చారు. పర్వత పరిసర ప్రాంతాలకు ఎవరినీ వెళ్ళవద్దని ఆదేశాలు జారీ చేసారు.
మోక్షజ్ఞతో రకుల్ ప్రీత్ సింగ్ రొమాన్స్!

మోక్షజ్ఞతో రకుల్ ప్రీత్ సింగ్ రొమాన్స్!

నందమూరి మోక్షజ్ఞ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటించబోతున్నాడనే వార్తలు పరిధి పెరుగుతోంది. కొంత కాలంగా ఈ ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో బాలయ్య తన తండ్రి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవిత చరిత్రని ఆవిష్కరించే చిత్రం కావడంతో బాలయ్య ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జాగర్లమూడి క్రిష్ ఈ చిత్రానికి దర్శకుడు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ నటించబోతోంది. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో మోక్షజ్ఞ ఎన్టీఆర్ టీనేజ్ రోల్ పోషించబోతున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

బరువు తగ్గే క్రమంలో శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ స్థాయిల గురించి తెలుసా?

బరువు తగ్గే క్రమంలో శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ స్థాయిల గురించి తెలుసా?

రోజుకి తీసుకోవలసిన ప్రోటీన్ భత్యం 56 గ్రాములుగా మీరు విన్న, లేక పాటిస్తున్న అంశాన్ని ముందు పక్కన పెట్టండి, లేదా కిటికీ నుండి విసిరేయండి; ఒక వ్యక్తికి ఇంతే అవసరం అని చెప్పేవి, ఎన్నటికీ నిజం కావు, కానేరవు. తీసుకోవలసిన ఆహరం మరియు పోషకాల స్థాయిలు మనిషి శరీర తత్వాలను, రోగ నిరోధక స్థాయిలను బట్టి ఉంటుంది. కొండత ఎత్తు, బలిష్టమైన దేహధారుడ్యం కలిగిన వ్యక్తులకి ఒక గుడ్డు ఇచ్చి సరిపెట్టుకోమని చెప్పడం హాస్యాస్పదమే అవుతుంది.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more