Short News

అఖిల్‌తో ఆర్జీవీ సినిమానా.. అలాంటి కథ అంటూ వార్తలు!

అఖిల్‌తో ఆర్జీవీ సినిమానా.. అలాంటి కథ అంటూ వార్తలు!

అక్కినేని యువ హీరో అఖిల్ ఇప్పుడిప్పుడే కెరీర్ పరంగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తొలి చిత్రం అఖిల్, రెండవ చిత్రం హలో ఆశించిన స్థాయి విజయాన్ని అందివ్వలేదు. ప్రస్తుతం అఖిల్ తొలిప్రేమ చిత్రంతో సత్తా చాటిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ మాట్లాడుతూ అఖిల్ తో సినిమా చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయని సంచలన ప్రకటన చేశాడు. కానీ అక్కినేని ఫ్యామిలీ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు.

కస్టమ్స్‌ బ్రోకరేజ్‌ లైసెన్స్‌ వారికి ఆధార్‌, పాన్‌ కార్డు తప్పనిసరి

కస్టమ్స్‌ బ్రోకరేజ్‌ లైసెన్స్‌ వారికి ఆధార్‌, పాన్‌ కార్డు తప్పనిసరి

కస్టమ్స్‌ బ్రోకరేజ్‌ లైసెన్స్‌ కావాలనుకునేవారు ఆధార్‌, పాన్‌ను తప్పనిసరిగా సమర్పించాలని, కేంద్ర ఎక్సైజ్‌, కస్టమ్స్‌ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. వ్యాపార సంబంధించిన ఎగుమతులు, దిగుమతులు చేయటం, ఆడిట్‌ నిర్వహించడం తదితర కార్యకలాపాలను అధికారికంగా నిర్వహించాలంటే కస్టమ్స్‌ బ్రోకరేజ్‌ లైసెన్స్‌ కావాల్సి ఉంటుంది. ఈ మేరకు అందుకు అనుమతులు పొందాలంటే కస్టమ్స్‌ బ్రోకర్స్‌ లైసెన్స్‌ రెగ్యులేషన్స్‌ 2018 ప్రకారం సదరు వ్యక్తి తన ఆధార్‌, పాన్‌లను సమర్పించాల్సి ఉంటుంది.
డెత్‌ ఓవర్లలో అద్భుత ప్రదర్శనతోనే గెలిచాం

డెత్‌ ఓవర్లలో అద్భుత ప్రదర్శనతోనే గెలిచాం

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శనివారం జరిగిన పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 5వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్‌ బెర్తును ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే డెత్‌ ఓవర్లలో ప్రసిద్ధ్‌ అద్భుత ప్రదర్శనతోనే కోల్‌కతా విజయం సులభమైందంటున్నాడు ఆ జట్టు యువ బ్యాట్స్‌మెన్‌ శుభ్‌మన్‌ గిల్‌.డెత్‌ ఓవర్లలో మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా ప్రసిద్ధ్‌ బౌలింగ్‌ ప్రదర్శనే మ్యాచ్‌ను మావైపు తిప్పేలా చేసింది. అతను సులువుగా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడని' అని గిల్‌ చెప్పుకొచ్చాడు.
5ఏళ్లు సుస్థిర ప్రభుత్వంపై సోనియాతో చర్చిస్తా: కుమారస్వామి

5ఏళ్లు సుస్థిర ప్రభుత్వంపై సోనియాతో చర్చిస్తా: కుమారస్వామి

తాను సోమవారం ఉదయం ఢిల్లీకి వెళ్తున్నానని జేడీఎస్ నేత కుమారస్వామి ఆదివారం వెల్లడించారు. కేబినెట్ కూర్పుపై చర్చించనున్నట్లు తెలిపారు. అలాగే, రానున్న అయిదేళ్ల పాటు స్థిరమైన ప్రభుత్వాన్ని ఎలా ఇవ్వాలో కాంగ్రెస్ నేతలతో చర్చిస్తామని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే బలనిరూపణ చేసుకుంటానని తెలిపారు. సోమవారం ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌ గాంధీని కలుస్తానని తెలిపారు.
ఇదిలా ఉండగా, ఇరు పార్టీల నేతలు ఈ రోజు సమావేశమై బలనిరూపణ, కేబినెట్ కూర్పుపై చర్చిస్తున్నారు.