Short News

తిరుగులేని 50 రోజులు.. బాక్స్ ఆఫీస్‌ని దున్నేసిన మెగా పవర్ స్టార్, గర్వపడే రోజు!

తిరుగులేని 50 రోజులు.. బాక్స్ ఆఫీస్‌ని దున్నేసిన మెగా పవర్ స్టార్, గర్వపడే రోజు!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్ర ఘనవిజయంలో మరో మైలురాయి అధికమించింది. నేటితో రంగస్థలం చిత్రం 50 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఒకప్పుడు అయితే సినిమా ఎన్ని రోజులు ఆడింది అని మాట్లాడుకునే వారు. కానీ ఇప్పుడు చిత్రాల విడుదల శైలిలో చాలా మార్పులు వచ్చాయి. అత్యధిక థియేటర్ లలో విడుదలవుతుండడం వలన ఓ చిత్రం రెండు వారాలు ఆడితే గొప్పగా చెప్పుకుంటున్నారు.మార్చి 30 న వేసవి కానుకగా ప్రేక్షుకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలని అందుకుని ప్రభంజనం సృష్టించింది.

ఉత్తమ యూనివర్సిటీల్లో హెచ్‌సీయూకు 4వ స్థానం

ఉత్తమ యూనివర్సిటీల్లో హెచ్‌సీయూకు 4వ స్థానం

వీక్‌ మ్యాగజైన్‌-హన్సా రీసెర్చ్‌ ఇటీవల ఉత్తమ యూనివర్సిటీలకు సంబంధించి సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ నాలుగో స్థానం దక్కించుకుంది. దేశవ్యాప్తంగా సాగిన ఈ సర్వేలో జేఎన్‌యు, యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ, బనారస్‌ హిందూ యూనివర్సిటీలు మొదటి మూడు స్థానాలు దక్కించుకోగా హెచ్‌సీయూ నాలుగో స్థానంలో నిలిచింది. దక్షిణ భారతదేశ పరంగా హెచ్‌సీయు మొదటి స్థానంలో నిలిచింది. 2017లో వీక్‌ మ్యాగజైన్‌ సర్వేలో కూడా హెచ్‌సీయూ నాలుగో స్థానంలో నిలిచింది.
మహానటి సావిత్రిని ప్రొడక్షన్ బాయ్ కూడా, దిండు కింద 2 వేలు పెట్టి.. దయనీయ స్థితి కళ్లారా చూశా!

మహానటి సావిత్రిని ప్రొడక్షన్ బాయ్ కూడా, దిండు కింద 2 వేలు పెట్టి.. దయనీయ స్థితి కళ్లారా చూశా!

క్యారెక్టర్ రోల్స్ తో గుమ్మడి వెంకటేశ్వర రావు తిరుగులేని నటన కనబరిచారు. ఎన్నో అద్భుత చిత్రాల్లో ఆయన నటించారు. ఎన్టీఆర్, ఎన్నార్, సావిత్రి వంటి గొప్ప నటులతో ఆ తరువాత తరం నటులు చిరంజీవి, నాగార్జున వంటి నటుల చిత్రాల్లో కూడా గుమ్మడి నటించారు. ఇటీవల జరిగి ఓ ఇంటర్వ్యూలో మహానటి సావిత్రి గురించి గుమ్మడి ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించారు. సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి చిత్రం అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. సావిత్రితో కలసి తాను అనేక చిత్రాల్లో నటించానని గుమ్మడి అన్నారు. సావిత్రి నన్ను అన్నయ్య అని పిలిచేది.

తెల్లారేసరికే ఫ్యానుకు వేలాడుతూ..: పెళ్లయిన కొద్దిరోజులకే నవ

తెల్లారేసరికే ఫ్యానుకు వేలాడుతూ..: పెళ్లయిన కొద్దిరోజులకే నవ

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ధర్మారావు పేట గ్రామానికి చెందిన మెరుగు గట్టయ్య, లక్ష్మిల రెండో కుమార్తె మానస అలియాస్‌ అరుణ(19), కాగజ్‌నగర్‌ మండలం జంబుగా గ్రామానికి చెందిన బుస దుర్గక్క, నానయ్యల కుమారుడు రాజేశ్‌(23)లకు ఈ నెల 9న వివాహం జరిగింది. పెళ్లి సందర్భంగా వధువు కుటుంబ సభ్యులు రూ.3లక్షలు వరకట్నం కూడా ఇచ్చారు. అయితే కొద్దిరోజులకే భర్త నుంచి అదనపు కట్నం వేధింపులు ఎక్కువవడంతో.. ఆదివారం రాత్రి ఆమె సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకని ఆత్మహత్య చేసుకుంది.