Short News

'రంగస్థలం'లో మొదటి పాట ఏమంటే ..

'రంగస్థలం'లో మొదటి పాట ఏమంటే ..

రామ్‌చరణ్, సమంత నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం'. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చరణ్‌ ‘చిట్టబాబు'గా సమంత 'రామలక్ష్మి'గా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన రెండు పాత్రల టీజర్లకు విశేష స్పందన లభించింది. మంగళవారం ఈ సినిమాలోని తొలి పాటను విడుదల చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని 'ఎంత సక్కగున్నావే..' అనే పాటను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం పోస్టర్‌ను విడుదల చేసింది.  
త్వ‌ర‌లో అమితాబ్‌తో  సురేందర్‌రెడ్డి డైరెక్షన్

త్వ‌ర‌లో అమితాబ్‌తో సురేందర్‌రెడ్డి డైరెక్షన్

త్వ‌ర‌లో బాలీవుడ్ టాప్ స్టార్ అమితాబచ్చన్ ను టాలీవుడ్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి డైరెక్ష‌న్ చేయ‌బోతున్నాడు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి క‌థానాయకుడిగా న‌టిస్తున్న ‘సైరా' సినిమా తెర‌కెక్కిస్తున్నారు. అయితే ఇందులో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కన్పించనున్నాడు. ఈ ప్రాజెక్టు డిష్కషన్స్‌లో భాగంగా డైరెక్టర్ సురేందర్‌రెడ్డి అమితాబ్‌ను కలిశాడు. సురేంద‌ర్ రెడ్డి బిగ్‌బీతో కలిసి దిగిన ఫొటో ఇపుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది.
నోకియ్ 7ప్లస్ ఫొటోలు లీక్..!

నోకియ్ 7ప్లస్ ఫొటోలు లీక్..!

హెచ్‌ఎండీ గ్లోబల్ నోకియా కంపెనీ నోకియా జోష్ మీదుంది. స్మార్ట్ ఫోన్ల‌ను విడుద‌ల చేయ‌డంలో జ‌ట్ స్పీడ్ మీద ఉంది. త్వరలో మరో కొత్త మోడల్‌ను విడుదల చేయబోతోంది. కొత్త ఫోన్ కు కొన్ని ఫోటోలు సైతం సోషల్‌ మీడియాలో లీకయ్యినట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో దీన్ని ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది.6అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ రిజల్యూషన్‌, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ మెమోరీ ఉంటుంది. హెచ్‌ఎండీ గ్లోబల్‌ నుంచి ఆండ్రాయిడ్‌ ఒన్‌తో వస్తున్న తొలి మొబైల్‌ కూడా ఇదే కావ‌డం విశేషం.
సూపర్  ఫీచర్స్ తో సెల్ కాన్ నుంచి యూనిక్ ఫోన్

సూపర్ ఫీచర్స్ తో సెల్ కాన్ నుంచి యూనిక్ ఫోన్

స్మార్ ఫోన్స్‌, ఫీచ‌ర్డ్ ఫోన్ల‌తో మొబైల్ త‌యారీ రంగంలో సెల్ కాన్ కంపెనీ త‌నదైన హావా కొన‌సాగిస్తూ వ‌స్తుంది. వినియోగ‌దారుల అభిరుచుల‌కు త‌గ్గ‌ట్టుగా ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ చేస్తూ క‌ష్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటుంది. సెల్ కాన్ కంపెనీ నుంచి నూతన స్మార్ట్‌ఫోన్ 'యూనిక్‌'ను తాజాగా విడుదలయింది. రూ.8,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో వెనుక భాగంలో 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా ఉండగా, ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఇక రెండు కెమెరాలకు కూడా ఫ్లాష్ సదుపాయం క‌ల్పించారు.