Short News

ఎంత సక్కగున్నావే 'రామలక్ష్మీ'.!
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/-xgy9rTzUnw" frameborder="0" allow="autoplay; encrypted-media" allowfullscreen></iframe>

ఎంత సక్కగున్నావే 'రామలక్ష్మీ'.!

రామ్‌చరణ్, సమంత నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం'. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చరణ్‌ ‘చిట్టిబాబు'గా, సమంత 'రామలక్ష్మి'గా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన రెండు పాత్రల టీజర్లకు విశేష స్పందన లభించింది. మంగళవారం ఈ సినిమాలోని తొలి పాటను విడుదల చేసారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని 'ఎంత సక్కగున్నావే..' అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేసారు. చంద్రబోస్ రాసిన పాట అచ్చమైన తెలుగు పదాలతో పల్లెపడుచు సోయగంలా ఉంది.
స్విఫ్ట్ సిస్టంపై 2016లోనే హెచ్చరించిన ఆర్‌బీఐ!

స్విఫ్ట్ సిస్టంపై 2016లోనే హెచ్చరించిన ఆర్‌బీఐ!

స్విఫ్ట్ సిస్టమ్.. బ్యాంకుల మధ్య పరస్పరం సమాచారం పంపుకునే విధానం. ఇప్పుడు ఈ స్విఫ్ట్ సిస్టమే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ స్కాంకు కారణభూతమైంది. ఈ స్విఫ్ట్ సిస్టమ్‌ ద్వారానే ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీ రూ.11,400 కోట్ల స్కాంకు పాల్పడ్డారు. నిజానికి పీఎన్‌బీ స్కాం వెలుగులోకి రావడానికి రెండేళ్ల క్రితమే అంటే 2016లోనే.. ఈ స్విఫ్ట్‌ ఇంటర్‌బ్యాంకు నెట్‌వర్క్‌లో లోపాలున్నాయని, వాటిని దుర్వినియోగ పరుస్తున్నట్లుగా రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా దేశంలోని అన్ని బ్యాంకులకు హెచ్చరించింది.

మేడపైనే విమానం తయారుచేశాడు.. రూ.35 వేల కోట్ల డీల్ కొట్టేశాడు

మేడపైనే విమానం తయారుచేశాడు.. రూ.35 వేల కోట్ల డీల్ కొట్టేశాడు

కెప్టెన్ అమోల్ యాదవ్ ముంబయిలోని కండివాలి సబర్బ్‌లోని తన ఇంటి మేడపై ఆరేళ్లపాటు శ్రమించి ఆరుగురు కుర్చునే వీలున్న విమానం తయారు చేశారు. ముంబయిలో జరిగిన 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో ఆ విమానాన్ని ప్రదర్శనకు ఉంచారు. అమోల్ యాదవ్ సొంతగా తయారుచేసిన విమానం విజయవంతంగా ఎగరడంతో ఆయనతో భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో అమోల్ యాదవ్‌కు చెందిన థ్రస్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ప్రభుత్వం రూ.35వేల కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది.

గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్య కశప'గా రానా

గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్య కశప'గా రానా

నటుడు రానా పౌరాణిక చిత్రానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం 1945, హథీ మేరీ సాథీతో సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత గుణశేఖర్‌ దర్శకత్వంలో 'హిరణ్య కశ్యప' సినిమాను రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో భక్త ప్రహ్లాదుడి కథను హిరణ్యకశ్యపుడి కోణంలో చూపించనున్నారు. ఈ చిత్రాన్ని రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు.