Short News

హ్యాంగోవర్‌కు ఏదైనా మందులు రాయించరా.. నేల టికెట్ ట్రైలర్ రిలీజ్
<iframe width="600" height="450" src="https://www.youtube.com/embed/0-Q2KDmDX8E" frameborder="0" allow="autoplay; encrypted-media" allowfullscreen></iframe>

హ్యాంగోవర్‌కు ఏదైనా మందులు రాయించరా.. నేల టికెట్ ట్రైలర్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు కల్యాణ్ కృష్ణ కాంబినేషన్‌లో ఎస్ఆర్టీ బ్యానర్‌పై రూపొందిన నేల టికెట్ థియేట్రికల్ ట్రైలర్ బుధవారం (మే 16) సాయంత్రం విడుదలైంది. ట్రైలర్ చూడగానే మాస్ మహారాజా చిత్రానికి కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయని అనిపించింది. హ్యాంగోవర్‌కు ఏదైనా మందులు రాయించరా, చుట్టు జనం, అందులో మనం.. అదే కదా లైఫ్, ముసలితనం అంటే చాతకాని తనం కాదురా.. నిలువెత్తు అనుభవం లాంటి డైలాగ్స్ ఆకట్టుకొనేలా ఉన్నాయి.

ఢిల్లీ ఘన విజయం..టోర్నీనుంచి ముంబై ఔట్

ఢిల్లీ ఘన విజయం..టోర్నీనుంచి ముంబై ఔట్

టీ20లీగ్ 2018లో భాగంగా పుణే వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 11 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ గెలిచింది. సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ పోరాటం లీగ్‌ దశలోనే ముగిసింది. బ్యాట్స్ మెన్స్ పేలవ ప్రదర్శనతో సొంతగడ్డపై 163 పరుగులకే ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఫలితంగా మరోసారి ప్లేఆఫ్‌కు చేరాలన్న ముంబై ఇండియన్స్‌ లక్ష్యం నెరవేరలేదు. అంతకుముందు ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ జట్టు 174 పరుగులు చేసింది. రిషబ్ పంత్ ఆఫ్ సెంచరీ సాధించాడు.
పెట్రోల్‌ ధరలు పెంపుపై స్పందించిన కేంద్రమంత్రి

పెట్రోల్‌ ధరలు పెంపుపై స్పందించిన కేంద్రమంత్రి

పెట్రోల్‌ ధరలు అత్యంత గరిష్టస్థాయికి చేరుకోవడంపై కేంద్ర పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పందించారు. పెట్రో ఉత్పత్తులు తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం.. పెట్రోల్‌, డిజిల్‌ ధరలపై ప్రభావం చూపిందన్నారు. పెట్రోల్‌, డిజిల్‌ ధరలు పెరుగుదలతో సామన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని తాను అంగీకరిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే భారత ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుందని పేర్కొన్నారు.
అందరికి థ్యాంక్స్..యంగ్ టైగర్ ఎన్టీఆర్

అందరికి థ్యాంక్స్..యంగ్ టైగర్ ఎన్టీఆర్

నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వరుస ట్వీట్లు చేస్తూ తన సంతోషాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇన్నేళ్ల నా కెరీర్‌లో కష్టసుఖాల్లో నాకు శాశ్వతంగా తోడున్నది, అండగా నిలిచింది ప్రేక్షకుల ప్రేమ, అదరణే. మీ రుణం తీర్చుకోగలుగుతానని భావించడం లేదు. అభిమానులకు హృదయ పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా' అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.నా కొలిగ్స్‌కి, నా శ్రేయోభిలాషులు, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన అందరికీ బిగ్ థ్యాంక్స్'అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.