Short News

పెద్ద ప్రొడ్యూసర్ ఇలా చేస్తే నమ్మలేదు, ఇండస్ట్రీ నుండి తరిమేస్తానన్నాడు:  వర్మ

పెద్ద ప్రొడ్యూసర్ ఇలా చేస్తే నమ్మలేదు, ఇండస్ట్రీ నుండి తరిమేస్తానన్నాడు: వర్మ

టాలీవుడ్లో శ్రీరెడ్డితో పాటు పలువురు ఆర్టిస్టులు కాస్టింగ్ కౌచ్ అంశంపై మాట్లాడుతూ, ఇండస్ట్రీకి చెందిన పలువురి భాగోతాలు బయట పెడుతూ సంచలనం క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ..... ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని, ఓ సారి ఓ పెద్ద నిర్మాత హీరోయిన్‌ను కమిట్మెంట్ అడగటంతో తాను కూడా షాకయ్యానని వర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. బేసిగ్గా మగజాతి అంతే అని, సినిమాతో పాటు చాలా రంగంల్లో ఇది ఉందన్నారు. సినిమా రంగానికి వచ్చే అమ్మాయిలు అందుకు సిద్ధపడే వస్తారని ఇండస్ట్రీ పీపుల్ భావిస్తుంటారని వర్మ తెలిపారు.

అత్యాచారానికి పాల్పడితే ఇక మరణశిక్షే

అత్యాచారానికి పాల్పడితే ఇక మరణశిక్షే

12 ఏళ్ల లోపు చిన్నారులపై అత్యాచారం చేస్తే ఇక మరణశిక్ష తప్పదు. నిందితులకు మరణదండన విధించేలా పోక్సో చట్టానికి సవరణలు చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్‌ను కేంద్రమంత్రి వర్గం శనివారం ఆమోదించింది. పోక్సో చట్టానికి సవరణలు తేనున్నట్లు కేంద్రం శుక్రవారం అధికారికంగా సుప్రీంకోర్టుకు తెలియజేసిన సంగతి విదితమే. కతువా,ఉన్నావ్ ఘటనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది
సీఎం, మాజీ సీఎం ఆశీర్వాదం, బీజేపీ ర్యాలీలో గాలి జనార్దన్

సీఎం, మాజీ సీఎం ఆశీర్వాదం, బీజేపీ ర్యాలీలో గాలి జనార్దన్

గాలి జనార్దన్ రెడ్డి ప్రాణ మిత్రుడు, బళ్లారి బీజేపీ ఎంపీ శ్రీరాములు శనివారం చిత్రదుర్గ జిల్లాలోని మాళకాల్మూరు శాసన సభ నియోజక వర్గంలో నామినేషన్ వేశారు. శ్రీరాములు నామినేషన్ కార్యక్రమానికి గాలి జనార్దన్ రెడ్డి స్వయంగా హాజరైనారు. శ్రీరాములు నామినేషన్ కార్యక్రమానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరైనారు. బీఎస్. యడ్యూరప్పను చూసిన వెంటనే గాలి జనార్దన్ రెడ్డి ఆయనకు పాదాబివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.

బీజేపీకి సీనియర్ నేత యశ్వంత్ సిన్హా రాజీనామా

బీజేపీకి సీనియర్ నేత యశ్వంత్ సిన్హా రాజీనామా

భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా శనివారం రాజీనామా చేశారు. తరచూ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ విమర్శలు చేస్తూ సంచలనంగా మారిన ఆయన.. ఎట్టకేలకు పార్టీకి గుడ్ బై చెప్పారు.
రాజీనామా చేసిన సందర్భంగా ఆయన 'రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటున్నా' అని ప్రకటించారు. అంతేగాక, తాను ఇక ఏ పార్టీలోనూ చేరబోవడం లేదని సిన్హా స్పష్టం చేశారు. జనవరిలో తాను ప్రారంభించిన రాష్ట్రమంచ్ సంస్థ పార్టీలకు అతీతంగా పనిచేస్తుందని చెప్పారు.