Short News

శ్రీరెడ్డిని చూసి టాలీవుడ్ వణికిపోతుంది

శ్రీరెడ్డిని చూసి టాలీవుడ్ వణికిపోతుంది

టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌ అంశంపై శ్రీరెడ్డికి మద్దతుగా రాంగోపాల్ వర్మ తాజాగా మరోసారి స్పందించాడు. ఆమె నిజాయితీని ఎదుర్కొలేక ఇండస్ట్రీలో ఉన్న మగాళ్లు సైతం వణికిపోతున్నారన్నారు. కొందరు మహిళలు ఆమెకు వస్తున్న పాపులారిటీని భరించలేక అసూయతో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని... మరికొందరు ఆమె గతంలో చేసిన పనులను, ఆమె మాట్లాడిన అసభ్య భాషను గుర్తు చేస్తూ.. ఆమె ఉద్యమకారిణి కాదని వాదిస్తున్నారన్నారు. అయితే శ్రీరెడ్డి కూడా అశోకుడంతటి గొప్ప వ్యక్తి' అంటూ వర్మ తెలిపారు.
క్యూ4లో 'యాక్సిస్' బ్యాంకు నష్టం రూ.2,189కోట్లు

క్యూ4లో 'యాక్సిస్' బ్యాంకు నష్టం రూ.2,189కోట్లు

దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్‌ 'యాక్సిస్‌'కు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం ఫలితాలను వెల్లడించింది. మొండిబకాయిలు భారంగా మారటంతో బ్యాంక్‌ రూ.2,189 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. బ్యాంక్‌ మొత్తం ఆదాయం స్వల్పంగా పెరిగి రూ.14,181 కోట్ల నుంచి రూ.14,560 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం ఎలాంటి పెరుగుదల లేకుండా రూ.4,730 కోట్లుగా నమోదైంది. మొత్తం రుణాలు 18 శాతం వృద్ధి చెందాయి. గురువారం మార్కెట్లో ట్రేడింగ్‌ ముగిసాక ఫలితాలను ప్రకటించారు. దీనితో షేరు రూ.495 వద్ద ముగిసింది.
నటనా వారసత్వం అనేది ఒక భారం

నటనా వారసత్వం అనేది ఒక భారం

చిత్రసీమలో వారసత్వం అనే అంశంపై నటి కాజల్ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. 'పుట్టుకతోనే ఎవరూ స్టార్లు కారు. వారి ప్రతిభే వారిని స్టార్లు చేస్తుంది. వారసత్వ కథానాయకులతో నేను కూడా నటించాను. మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, నాగ చైతన్య, కల్యాణ్‌రామ్‌ వీరంతా వారసత్వ నటులే. కేవలం వారిని స్టార్‌ వారసులుగా చూడలేం. కష్టాన్ని నమ్ముకుని పనిచేసారు కాబట్టే వారికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది. నిజానికి వారసత్వం ఓ భారం' అని చెప్పుకొచ్చింది.
దీర్ఘాయుష్మాన్ భవ: రుగ్వేదం ఉపవేదమే ఆయుర్వేదం

దీర్ఘాయుష్మాన్ భవ: రుగ్వేదం ఉపవేదమే ఆయుర్వేదం

శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి

అనేది వేద పురుష ఆశీర్వచనం.
మనలను నిండా నూరేళ్లు బ్రతకమని వేదం ఆశీర్వదిస్తోంది వేద మంత్రానికి ఉన్న శక్తి గొప్పది కాబట్టి వేదజ్ఞులైన పెద్దలకు నమస్కరించి వారిచే ఈ ఆశీర్వచనం పొందుతూ ఉంటాం.

అలాగే నిత్యం చేసుకొనే సంధ్య వందన సూర్యోపస్థానంలో

పశ్యేమ శరదశ్శతం,జీవేమ శరదశ్శతం,నందామ శరదశ్శతం, మోదామ శరదశ్శతం అని చెప్పబడించి.

నిండు నూరేళ్లు ఆ సూర్యుని చూడగలగాలి.
నిండా నూరేళ్ళు జీవించాలి.ఆది కూడ ఆనందంగా జీవించాలి అని ఆకాంక్షిస్తాం

ఇలా ఆకాంక్షించటంలో ఎంతో విలువ ఉంది.