Short News

'కాస్టింగ్ కౌచ్' నాకూ తప్పలేదు, 'కాంప్రమైజ్' అంటే అదే?: సనాఖాన్

'కాస్టింగ్ కౌచ్' నాకూ తప్పలేదు, 'కాంప్రమైజ్' అంటే అదే?: సనాఖాన్

అవకాశాల కోసం 'కాంప్రమైజ్' అవక తప్పదన్న మాటలే ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంటాయని, ఆ కాంప్రమైజ్‌కు అర్థాలు వేరుగా ఉంటాయని వారు చెబుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ సనా ఖాన్ కూడా తాజాగా దీనిపై స్పందించారు. సినిమాల్లోకి వచ్చాక తనకూ ఇలాంటి అనుభవాలు తప్పలేదని వెల్లడించారు.'ఇండస్ట్రీలో అవకాశాలు మొదలైన తర్వాత.. కొంతమంది కో-ఆర్డినేటర్స్‌ను కలవాల్సి ఉంటుంది. వారు మిమ్మల్ని హోటల్స్‌కు రమ్మంటారు.

స్పీకర్ వైఖరి బాధాకరం: జేసీ, ఇదో చారిత్రక తప్పిదం: జీవీఎల్

స్పీకర్ వైఖరి బాధాకరం: జేసీ, ఇదో చారిత్రక తప్పిదం: జీవీఎల్

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన విషయంలో లోకసభ స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ వైఖరిని ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి తప్పుపట్టారు. నిబంధనలంటే లెక్కలేని రీతిలో కేంద్ర ప్రభుత్వం, స్పీకర్‌ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. మరోవైపు ఇదే అంశంపై కేంద్రంపై బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహరావు మాట్లాడుతూ టీడీపీ తీరుపై విమర్శలు గుప్పించారు. టీడీపీ అవిశ్వాస తీర్మానం తీసుకురావడం చరిత్రక తప్పిదంగా ఆయన అభివర్ణించారు. ఓటమి బాటలో ఉన్న పార్టీలతో జతకట్టిన చంద్రబాబుకు పరాజయం తప్పదని ఆయన జోస్యం చెప్పారు.

జేఎన్‌యూలో ఉద్రిక్తత... పోలీసులతో విద్యార్థుల బాహాబాహీ!

జేఎన్‌యూలో ఉద్రిక్తత... పోలీసులతో విద్యార్థుల బాహాబాహీ!

లైంగిక వేధిపుల ఆరోపణలపై జేఎన్‌యూ ప్రొఫెసర్ అరెస్టుకు విద్యార్థులు చేస్తున్న డిమాండ్ సోమవారం ఉద్రిక్తతకు దారితీసింది. జేఎన్‌యూ ప్రొఫెసర్‌ అతుల్ జోహ్రిని తక్షణం అరెస్టు చేయాలంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ ఢిల్లీ వసంత్‌కుంజ్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. స్టేషన్ ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సమయంలో విద్యార్థులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

జనసేనానిపై విరుచుకుపడిన టీడీపీ నాయకులు...

జనసేనానిపై విరుచుకుపడిన టీడీపీ నాయకులు...

పోలవరం ప్రాజెక్టులో అవినీతి అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు విరుచుకుపడ్డారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు, నారాయణ పవన్ వ్యవహార శైలిని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీపై పవన్ చేసిన వ్యాఖ్యలతో ఆయన ప్రతిష్టే మంటగలిసిందని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి విమర్శించగా, పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవినీతికి ఆస్కారమే లేదంటూ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కొట్టిపారేశారు.