Short News

మంచు లక్ష్మి తొక్కేస్తోందన్న శ్రీరెడ్డి, ఆ నాలుగు కుటుంబాలకు, పవన్ కళ్యాణ్‌కు వార్నింగ్....

మంచు లక్ష్మి తొక్కేస్తోందన్న శ్రీరెడ్డి, ఆ నాలుగు కుటుంబాలకు, పవన్ కళ్యాణ్‌కు వార్నింగ్....

సినీ పరిశ్రమలో తెలుగు వారికి అవకాశాలు, కాస్టింగ్ కౌచ్ అంశంపై పోరాటం చేస్తున్న శ్రీరెడ్డి సోమవారం మహిళా సంఘాలతో కలిసి సోమవారం బషీర్ బాగ్ క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తమ పోరాటాన్ని పట్టించుకోని ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించింది. ఇండస్ట్రీని ఏలుతున్న నాలుగు కుటుంబాలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మంచు లక్ష్మి, పవన్ కళ్యాణ్‌ పేర్లను ప్రస్తావిస్తూ పలు సంచలన కామెంట్స్ చేశారు. అభిమానులను అదుపులో పెట్టుకోవాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను శ్రీరెడ్డి హెచ్చరించారు.

రేపు ఆర్బీఐ ప్రెస్ నుంచి రూ.500 కోట్లు వ‌స్తున్నాయ‌న్న సీఎం

రేపు ఆర్బీఐ ప్రెస్ నుంచి రూ.500 కోట్లు వ‌స్తున్నాయ‌న్న సీఎం

శుక్రవారం రూ.500 కోట్లు నేరుగా ఆర్బీఐ ప్రింటింగ్ ప్రెస్ నుంచి వస్తున్నాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. నోట్ల రద్దు నాటి పరిస్థితులే ప్రస్తుతం నెలకొన్నాయని, ఒకటో తారీఖు వస్తోందంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకులు ఇలా వ్యవహరిస్తే సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలుచేయాలని ఆయన ప్రశ్నించారు. తీసుకున్న నగదు చాలా వరకు ఖర్చు చేయడం లేదని, నగదును ఇళ్లలోనే ఉంచుకుంటున్నారని, దీని వల్లే నగదు కొరత ఏర్పడిందని బ్యాంకర్లు వివరించారు.   
అఖిలప్రియను తాకాలంటే: ఏవీ సుబ్బారెడ్డికి మౌనిక వార్నింగ్

అఖిలప్రియను తాకాలంటే: ఏవీ సుబ్బారెడ్డికి మౌనిక వార్నింగ్

తన అక్క భూమా అఖిలప్రియను తాకితే ఊరుకునేది లేదని భూమా మౌనికా రెడ్డి గురువారం హెచ్చరించారు. ఆళ్లగడ్డలో అఖిల, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్ల దాడి జరిగింది. అఖిల వర్గం దాడి చేసిందని ఏవీ వర్గం ఆరోపించింది. దీనిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురిని తన వద్దకు రమ్మని చంద్రబాబు చెప్పారు. బుధవారం అఖిల రాలేదు. గురువారం తన సోదరుడు భూమా బ్రహ్మానంద రెడ్డి, సోదరి మౌనికా రెడ్డి తదితరులతో కలిసి అఖిలప్రియ చంద్రబాబును కలిసేందుకు అమరావతి వచ్చారు. ఈ సందర్భంగా మౌనిక మాట్లాడారు.

శ్రీరెడ్డి కోసం వర్మ భారీ ప్లానింగ్.. మరో సంచలనానికి తెర తీయబోతున్నారు!

శ్రీరెడ్డి కోసం వర్మ భారీ ప్లానింగ్.. మరో సంచలనానికి తెర తీయబోతున్నారు!

ప్రముఖ దర్శకుడు వర్మ ఏం చేసిన సంచలనమే. దర్శకత్వ ప్రతిభతోనే కాకుండా వికృత చేష్టలతో కూడా ఈ దర్శకుడు బాగా పాపులర్. వర్మ అనుకుంటే చాల అది ఎలాంటి కార్యమైనా అయిపోవలసిందే. పవన్ కళ్యాణ్ తల్లిని తిడితే పబ్లిక్ అటెన్షన్ వస్తుందనే కొత్త ఫార్ములా కనిపెట్టింది కూడా ఇతగాడే. శ్రీరెడ్డి తో కలసి సినిమా చేయడానికి వర్మ ప్లాన్ చేస్తున్నాడట. ఈ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వర్మ, శ్రీరెడ్డి కలసి చేసిన అతిదారుణమైన పని వలన తెలుగు సినీ ఇండస్ట్రీ కాక మీద ఉంది.