Short News

వర్మ వద్ద అందరి జాతకాలు... శ్రీరెడ్డికి సోపర్ట్ ఇస్తుండటంతో గుబులు!

వర్మ వద్ద అందరి జాతకాలు... శ్రీరెడ్డికి సోపర్ట్ ఇస్తుండటంతో గుబులు!

కాస్టింగ్ కౌచ్ మీద పోరాటం చేస్తున్న శ్రీరెడ్డికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా తన సపోర్టు ఇస్తూనే ఉన్నారు. మొన్న ఆమెను ఝాన్సీ రాణి లక్ష్మీబాయితో పోల్చిన వర్మ తాజాగా అశోక చక్రవర్తితో కంపేర్ చేస్తూ సంచలన ట్వీట్ చేశారు. శ్రీరెడ్డికి వర్మ ఇలా తన మద్దతు ప్రకటిస్తుండటంతో హీరోయిన్లను కాస్టింగ్ కౌచ్ ముసుగులో వాడుకున్న కొందరు సినిమా పెద్దల్లో గుబులు మొదలైంది. అసలే వర్మ తిక్కలోడు... ట్విట్టర్ లేదా ఫేస్ బుక్‌లో వారి గురించి చిన్న క్లూ ఇచ్చినా చాలు క్షణాల్లో అది వైరల్ అవుతుంది.

‘టోట‌ల్ డమాల్’ ఫస్ట్ లుక్ చూశారా.?

‘టోట‌ల్ డమాల్’ ఫస్ట్ లుక్ చూశారా.?

బాలీవుడ్ లో మరో సారి క్రేజీ కాంబోతో టోట‌ల్ డమాల్ అనే చిత్రం తెర‌కెక్కిస్తున్నాడు దర్శకుడు ఇంద్ర‌కుమార్‌. తాజాగా అనీల్ క‌పూర్‌, మాధురీ దీక్షిత్‌ల ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. చిత్రానికి సంబంధించిన పిక్ అనే టాక్ వినిపిస్తుండ‌గా, ఇందులో మాధురీ దీక్షిత్ భుజంపై రెండు చేతులు వేసి డిఫ‌రెంట్ స్టిల్ ఇచ్చాడు అనీల్ క‌పూర్‌. కామెడీ యాంగిల్ లో ఈ మూవీని దర్శకుడు తెర‌కెక్కిస్తున్న‌ట్టు తెలుస్తుంది. అభిమనుల మనసులలో చిరస్థాయిగా నిలిచేలా తమ చిత్రం ఉంటుందని దర్శకుడు ఇంద్ర కుమార్ అంటున్నారు.
జాహ్నవి హ్యాపీ మూడ్.. సెలబ్రేషన్స్‌లో శ్రీదేవి కూతురు!

జాహ్నవి హ్యాపీ మూడ్.. సెలబ్రేషన్స్‌లో శ్రీదేవి కూతురు!

దివంగత శ్రీదేవి కూతురు జాహ్నవిని ఓ వైపు విషాదాన్ని దిగమింగుతూ తన తొలి సినిమాను పూర్తి చేసింది. యువ హీరో ఇషాన్ కట్టర్‌తో ఆమె నటిస్తున్న దఢక్ చిత్ర షూటింగ్ పూర్తయింది. దాంతో జాహ్నవి, ఇషాన్ ఇద్దరూ కలిసి సెలబ్రేషన్స్ చేసుకొన్నారు. దఢక్ షూటింగ్ పూర్తయిన రోజే తన తొలి సినిమా బియాండ్ ది క్లౌడ్స్ రిలీజ్ కావడంతో ఇషాన్ ఆనందం రెండితలైంది. దఢక్ షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో చిత్ర యూనిట్ ఓ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకుడు శశాంక్ ఖైతాన్, జాహ్నవి తండ్రి, నిర్మాత బోనికపూర్ తదితరులు హాజరయ్యారు.

చిన్నారులపై అత్యాచారం చేస్తే ఇక ఉరి శిక్షే

చిన్నారులపై అత్యాచారం చేస్తే ఇక ఉరి శిక్షే

గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం తీవ్రమైన శిక్షలు అమలు చేసేందుకు సిద్ధమైంది. శనివారం సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం చిన్నారులపై అత్యాచారాల విషయమై కీలక నిర్ణయం తీసుకుంది. పోస్కో చట్టానికి సవరణలు చేసేందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 12 ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచారం జరిపివారికి మరణశిక్ష విధించేలా చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది.