Short News

శ్రీదేవి మరణం తర్వాత.. అది అసాధ్యం.. అలా చేస్తే పిచ్చిపనే!

శ్రీదేవి మరణం తర్వాత.. అది అసాధ్యం.. అలా చేస్తే పిచ్చిపనే!

హిందీలో 30 ఏళ్ల క్రితం రూపొందిన మిస్టర్ ఇండియా చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయ ఢంకా మోగించింది. శ్రీదేవి నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. శ్రీదేవి మరణానికి ముందు మిస్టర్ ఇండియాకు సీక్వెల్ రూపొందించాలని నిర్మాత బోనికపూర్ నిర్ణయం తీసుకొన్నారు. శేఖర్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ ఇండియాకు సీక్వెల్ అనగానే ఈ తరం ప్రేక్షకులకు మంచి జోష్ వచ్చింది. శ్రీదేవి మరణం తర్వాత బోనికపూర్ విషాదంలో కూరుకుపోయారు. మిస్టర్ ఇండియా సీక్వెల్ పనులు ఆగిపోయాయి. అయితే అందాల అభినేత్రి లేకుండా సీక్వెల్ కుదరదని బోనికపూర్ ఆ ప్రాజెక్ట్‌ను నిలిపివేశాడట.

మహిళల ఐపీఎల్: సూపర్ నోవాస్ ఘన విజయం

మహిళల ఐపీఎల్: సూపర్ నోవాస్ ఘన విజయం

ఒక్క రోజు మహిళల ఐపీఎల్  భాగంగా జరిగిన ఆటలో సూపర్ నోవాస్ విజయం సాధించింది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగన సూపర్ నోవాస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. బ్యాట్స్ ఉమెన్స్ అంతా సమిష్టిగా ఆడటంతో ట్రయల్‌బ్లేజర్స్‌ జట్టుపై సుపర్ నోవాస్ జట్టు గెలుపొందింది. మిథాలీరాజ్ 22, డానియల్లే వ్యాట్ ,24, హర్మన్ ప్రీత్ కౌర్ 21, సోపియా డెవిన్ 19 పరుగులు చేసి జట్టును విజయంలో భాగస్వాములయ్యారు. అంతకుముందు టాస్ గెలిచిన సూపర్ నోవాస్ బౌలింగ్ ఎంచుకోవడంతో ట్రై బ్లేజర్స్ బ్యాటింగ్ చేపట్టి.. ఆరు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది.
మైక్రో మ్యాక్స్ 'భార‌త్ గో' స్మార్ట్ ఫోన్ వ‌చ్చేసింది

మైక్రో మ్యాక్స్ 'భార‌త్ గో' స్మార్ట్ ఫోన్ వ‌చ్చేసింది

దేశీయ మొబైల్స్ తయారీదారు మైక్రోమ్యాక్స్ భారత్‌లో తన మొదటి ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ స్మార్ట్ ఫోన్‌ను ఇవాళ విడుద‌ల‌ చేసింది. 'భారత్ గో' పేరిట విడుదలైన ఈ ఫోన్ అసలు ధర రూ.4,399 గా ఉంది. అయితే ఎయిర్‌టెల్ అందిస్తున్న మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్ ఇనిషియేటివ్‌లో భాగంగా ఈ ఫోన్‌పై రూ.2వేల క్యాష్ బ్యాక్‌ను అందిస్తున్నారు. 4.5 ఇంచ్ డిస్‌ప్లే, 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ త‌దిత‌ర ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.    
బాబు వల్లే కర్ణాటకలో ఓట్లు పెరిగాయా?: సోము వీర్రాజు

బాబు వల్లే కర్ణాటకలో ఓట్లు పెరిగాయా?: సోము వీర్రాజు

చంద్రబాబునాయుడు ప్రభావం ఉంటే కర్ణాటకలో బిజెపికి 20 నుండి 35 శాతానికి ఓట్లు ఎందుకు పెరిగాయని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు టిడిపి నేతలను ప్రశ్నించారు. పవన్, జగన్ ను మేం నడిపిస్తోంటే మీరు ఎవరిని నడిపిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. జగన్, పవన్ లను మేం నడుపుతోంటే రాష్ట్రంలో మీరు ఎవరిని నడుపుతున్నారని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని టిడిపి నేతలపై వీర్రాజు మండిపడ్డారు.టిటిడి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు.